లిటరరీ ఫెస్ట్-2022 బ్రోచర్ ఆవిష్కరణ
తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో నిర్వహించే లిటరరీ ఫెస్ట్-2022 బ్రోచర్ ఆవిష్కరణ నల్లగొండ జిల్లా వట్టిమార్తి ఉన్నత పాఠశాలలో ఈ రోజు జరిగింది.
తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో నిర్వహించే లిటరరీ ఫెస్ట్-2022 బ్రోచర్ ఆవిష్కరణ నల్లగొండ జిల్లా వట్టిమార్తి ఉన్నత పాఠశాలలో ఈ రోజు జరిగింది. ఈ నెల 20, 21, 22 తేదీలలో హైదరాబాదులోని పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన భవనంలో తెలంగాణ సాహితి వారిచే లిటరరీ ఫెస్ట్ నిర్వహించడం జరుగుతోంది.
ఈ కార్యక్రమంలో ప్రముఖ వాగ్గేయకారులతో పాటు నవ యువ రచయితలు గాయకులు పాల్గొంటారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో పాటకు పట్టం కడుతూ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రముఖుల సందేశాలు సినీ గీతాల సాహిత్య విశ్లేషణ వ్యాస సంకలనం విడుదల పరెశోధక పత్రాల సమర్పణ సినీ వాగ్గేయకారుల పరిచయం సన్మానాలు ఉంటాయి. చివరి రోజున కవి సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో అత్యధికంగా కళాకారులు పాల్గొనవలసిందిగా కోరారు.
Also Read:లిటరరీ ఫెస్ట్-2022 బ్రోచర్ ఆవిష్కరణ
ఈ బ్రోచర్ ను వట్టిమార్తి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ డోకూరి శ్రీనివాస్ రెడ్డి విడుదల చేయగా తెలుగు భాషోపాధ్యాయులు రామకృష్ణ , ఉపాధ్యాయులు యాదయ్య, ఆనంద్, అరుణకుమారి , తెలంగాణ సాహితీ ప్రతినిధి బూర్గు గోపికృష్ణ, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.