కె ఎస్ అనంతాచార్య తెలుగు కవిత: శత్రువు!!

కోపాన్ని మించిన శత్రువు లేదంటున్న కె.ఎస్.  అనంతా చార్య కవిత చదవండి.

KS Ananthacharya Telugu poem nemy, telugu literature

మాట్లాడటం సులభమే
అనుసరణయే కష్టం కదిలికలు, కడుపు చించుకొని కాగితం మీదికి దించే ప్రయత్నం ప్రయోగించిన పదాలన్ని అక్షరాయస్కాంతాలే

ఎప్పుడు వస్తుందో ఎలా పుడుతుందో వానకాలం మేఘమై కురుస్తుంది ఈ పిడుగు ఎక్కడ పడుతుందో ఆ హృదయం కాలిపోతుంది

కోరుకోము, కొనుక్కోము
ఒంట్లోంచి భగ్గుమని లోపలి నుండి ఎగసిపడే నెగళ్లు ఆత్మీయతను బూడిద చేసే శారీరక పగుళ్లు

సింహాసనాలు ఊడి పడ్డాయి కిరీటాలు తెగిపడ్డాయి
ఒక్క కోపం... కొరివితో గోక్కున్నట్లే 
కోతి మెదడు అప్పు తెచ్చుకున్నట్లు

మనోమాయకోశం లో దాగుండి విసిరే పులి పంజాకు విలువల్ని మనిషిలోంచి రక్తదారల్లో గడ్డకడుతాయి

పూసే నవ్వుల మీద
విరిసే ఆప్యాయతల మీద అహంకారాలంకారం తో తచ్చాడే మానవ
మృగరూపo 

క్షణం ఓదార్పు క్షేమ సమాచార తీర్పు
లేదంటే కందగడ్డ మొహం కూర్పు

గొప్ప పనులు ఎన్ని చేసినా
రాతల్లో  శీర్షమై నిలిచి
గజా రోహణాలు జరిగినా
కోపం లేశమంత లేకుంటే
సర్వత్రా పూజ్య నీయమే

పిడికెడు సంతోషం అందిస్తే కడివేడు దుఃఖం పలాయనం చిత్తగించి
శాంతి దర్వాజకు చేరేడు అవుతుంది

జయించకుంటే సమాజంలో సాగుబాటు కరువై జీవనం  బరువవుతుంది

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios