"దండకడియం"కు కొత్తపల్లి నరేంద్ర బాబు సాహిత్య పురస్కారం

తగుళ్ళ గోపాల్ ఈ ఏడాది కొత్తపల్లి నరేంద్రబాబు సాహిత్య పురస్కారానికి  ఎంపికయ్యారు.  ఆయన రాసిన "దండకడియం" కవితా సంపుటిని అవార్డు కమిటీ  ఎంపికచేసింది. 

Kothapalli Narendrababu literary ward to Tagugulla Gopal poetry Danda Kadiyam

ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్ట్, కవిసమ్మేళనం సాహిత్యవేదిక వ్యవస్థాపకులు కొత్తపల్లి నరేంద్రబాబు స్మారకార్థం ప్రతిఏటా ఇచ్చే సాహిత్య పురస్కారానికి విశేష స్పందన లభించిందని,  పలు కవితా సంపుటిలు పోటీపడ్డాయని ప్రముఖ కవి, నిర్వాహకులు కొత్తపల్లి సురేష్ తెలిపారు.

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు,  యువకవి తగుళ్ళ గోపాల్ ఈ ఏడాది కొత్తపల్లి నరేంద్రబాబు సాహిత్య పురస్కారానికి  ఎంపికయ్యారు.  ఆయన రాసిన "దండకడియం" కవితా సంపుటిని అవార్డు కమిటీ  ఎంపికచేసింది. న్యాయనిర్ణేతలుగా ప్రముఖ సాహితీవేత్తలు జి.వెంకటకృష్ణ, పలమనేరు బాలాజీ, కె.నాగేశ్వరాచారి వ్యవహరించారు.

త్వరలో అనంతపురంలో జరిగే ప్రత్యేకసభలో విజేతకు అవార్డు అందజేసి సత్కరించనున్నట్లు కొత్తపల్లి సురేష్ వివరించారు.

24న ' సాహితీ నాగసూర్యమ్'

జానుడి - సెంటర్ ఫర్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ సాహిత్యంపై జనవరి 24 ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆన్లైన్ సాహిత్య సదస్సు జరుగుతుంది.

సాహితీ వీక్షణం, సాహితీ స్పర్శ  పుస్తకాలపై డాక్టర్ కాళ్లకూరి శైలజ,  విద్వాన్ విశ్వం పుస్తకం పై డాక్టర్ అప్పిరెడ్డి హరనాథరెడ్డి,  మదరాసు బతుకులు(కథలు) పై సయ్యద్ సలీం,  చెరగని స్ఫూర్తి తాపీ ధర్మారావు పుస్తకంపై డాక్టర్ శ్రీమతీ రామ్ నాధ్, కథా వరణం(పర్యావరణ కథలు)పై డాక్టర్ శిరంశెట్టి కాంతారావులు మాట్లాడుతారు. 

ఈ సభలో ముఖ్య అతిధిగా ప్రముఖ రచయిత, విశ్రాంత ఐ ఏఎస్ అధికారి డాక్టర్ అంగలకుర్తి విద్యాసాగర్ పాల్గొని ప్రసంగిస్తారు.  జానుడి - సెంటర్ సలహాదారు మల్లవరపు ప్రభాకరరావు ఆప్త వాక్యం అందిస్తారు. సమన్వయకర్తలుగా డాక్టర్ నూకతోటి రవికుమార్, జల్దా విశ్వనాథ కుమార్ వ్యవహరిస్తారు.

- డాక్టర్ నూకతోటి రవికుమార్ , డైరెక్టర్
జానుడి - సెంటర్ ఫర్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios