కోడం కుమారస్వామి కవిత : పులి - రాజా !

తప్పులకు తలవంచి క్షమాపణలు వేడుకోవాల్సిందే ! అంటూ కోడం కుమారస్వామి రాసిన కవిత ' పులి - రాజా ! ' ఇక్కడ చదవండి : 

Kodam Kumaraswamy's poem - bsb - opk

కన్నీళ్లెందుకు పులి రాజా !
నీ ఆకలికి బలైన లేడి పిల్లల
లెక్కెంతో చెప్పు
విగ్రహాలు మాట్లాడలేవు
మనుషులుగా మనమే మాట్లాడుకోవాలి
మన తప్పుల్ని మనమే సక్కదిద్దుకోవాలి !

కన్నీళ్ళు ఎందుకు పులి రాజా !
నీ చేతి పంజా గోళ్లలో నలిగిన లేతపూవులెన్నో
కూలిపోయిన గుడిసెలెన్నో జర లెక్కచెప్పు !

విగ్రహాలు మాట్లాడ లేవు
మాట్లాడే బిడ్డల గొంతుల్ని 
కుట్ర కత్తులతో తెగ్గోయకు
ఆడ బిడ్డలు అంగడి బొమ్మలు కాదు
గుత్పలు ఎత్తిన ఐలమ్మలు!

నీలోపలి తోడేలు ఎన్ని  బకరాలను బలి తీసుకుందో !
తోక బెత్తడు గొర్రె బొచ్చును
ఎన్ని సంచులు నింపావు
కాపరి ముందు మోకరిల్లి
లెక్క చెప్పాల్సిందే పులి రాజా !

జానపదులు నీడొక్క జీరి
డోలు కట్టి  డిల్లెంకల్లెం ఆడుతరు
నీ కన్నీళ్ళను చూసి మొసలి
ముసిముసిగా నవ్వుతుంది
నటనకు ఆస్కార్ అవార్డు సిగ్గులు ఒలకబోస్తుంది
మొసలి కన్నీళ్ళెందుకు పులి రాజా !
తప్పులకు తలవంచి క్షమాపణలు వేడుకోవాల్సిందే !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios