కరిపె రాజ్‌కుమార్‌ కవితా సంపుటి - ఆజాదీ - ఆవిష్కరణ సభ 26 నవంబర్‌ 2023 ఆదివారం ఉదయం 10.30 గంటలకు బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని షోయబ్‌ హాల్‌లో జరుగుతుంది. 

కరిపె రాజ్‌కుమార్‌ కవితా సంపుటి - ఆజాదీ - ఆవిష్కరణ సభకు డా. రూప్‌కుమార్‌ డబ్బీకార్‌ అధ్యక్షత వహిస్తారు. పుస్తకాన్ని కె. ఆనందాచారి ఆవిష్కరిస్తారు. సభలో డా. కాంచనపల్లి గోవర్థనరాజు, కొమ్మవరపు విల్సన్‌రావు, ఎం. నారాయణశర్మ, ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ ప్రసంగిస్తారు. ఈ సభ 26 నవంబర్‌ 2023 ఆదివారం ఉదయం 10.30 గంటలకు బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని షోయబ్‌ హాల్‌లో జరుగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

సమాజంలోని సంఘటనలు, వ్యవస్థీకృత దుర్మార్గానికి బలయ్యే మనుషుల సంవేదనలు చూసి చలించి కవిత్వం రాసే కవి కరిపె రాజ్‌కుమార్‌ గతంలో వనఝరి, స్వేచ్చాగానం, Unsung Adilabad కవితా సంపుటాలు వెలువరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీరిని 2016లో ఉత్తమ సాహితీవేత్తగా గుర్తించి గౌరవించింది. ఇప్పుడు ఈ ఆవిష్కరణ సభకు సాహిత్యాభిమానులను, కవులను పాలపిట్ట బుక్స్‌ సాదరంగా ఆహ్వానిస్తుంది.