Asianet News TeluguAsianet News Telugu

కందాళై రాఘవాచార్య కవిత: ఉభయ కుశలోపరి

తెలుగు సాహిత్యంలో కవిత్వానిదే అగ్రస్థానం. కందాళై రాఘవాచార్య ఉభయ కుశలోపరి అనే కవిత రాశారు. ఆ కవితను ఇక్కడ చదవండి.

Kandalai Raghvacharya Telugu poem Ubhaya Kushalopari
Author
Hyderabad, First Published Aug 5, 2020, 4:23 PM IST

ఉదయం వాకింగ్ లో
 పరిచయస్థులు ఎవరూ
ఎదురు బదురుగా రావడంలే -
శుభ శకునం కాదేమో
నా ముందు నా వెనకా నేనే !
రాని వారి కోసం కొసరి కొసరి
పోరు పెట్టినట్లు
ఇంటికి ఫోను చేస్తే 
బదులు జవాబు లేదు ?
అధికంగా అడిగితే 
బేతాళ ప్రశ్నలు మన పై !
చివరికి రాంగ్ నెంబరే        విసుగు విసుగు జవాబు
ఏమో ! రోజు పెద్దలు స్వాగతం
  అనేవారు జీవితానుభవ దరహాసంతో - ఏ ఊరు పోకడో 
మరి చెప్పా పెట్టకుండా !
ఈ గార్డెన్ బెంచిలన్నీ ఖాళీ
లాక్ డౌన్ వీధుల్లా !
ఇప్పుడు నా కన్నా చిన్నవాళ్లే
  ఎదురౌతున్నారు -
ముఖానికి డిజైన్ మాస్క్ 
ఐదారడుగులు దూరం దూరం
అనగా అనగా మాట లేదు
తలంతా రోబోల పోలికలు !
తలపులూ అంతే
ఎప్పుడూ ఇలాగే ఉంటే 
 సందడి కాలం ఎటో 
అంగడి మాటలోనే -
అందరం దగ్గరై మంచి చెడులు
 చెప్పుకునే రోజు వస్తేనే
భూమి నిజంగా తిరుతున్నట్లు !
పగలుకు పగలు - రాత్రికి రాత్రి
సరికి సరి తూకం వేసినట్లు !
అద్దంలో ముఖం సామూహిక
ఆనందంతో  లేదు --
చోద్యం
ఏదో గోడకు అతికినట్లు ముఖం
నగరమైన -పేరుఎడారే
తప్పిపోయిన తోవలు
ఎవరు దొరుకుతారు !
మన చేయి మనమే పట్టుకుని
మన కాళ్లను మనమే
నడిపించుకోవాలి !
పదిలం సుమా !
ఉభయ కుశలోపరి
అని ఎప్పుడు అంటామో !
ఈ పదం కొత్తగా వింటున్నామా
కాదు పాత పాత పాతది !
ఈ తరానికి కొత్త పదమేమో

మరింత సాహిత్యం కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature

Follow Us:
Download App:
  • android
  • ios