Asianet News TeluguAsianet News Telugu

కందాళై రాఘవాచార్య కవిత : వన్ బై టూ ఛాయ్ దోస్తాన

వన్ బై టు ఛాయే ఎన్నెన్ని సంగతులు ముందుకు తెన్తున్నదో అంటూ కందాళై రాఘవాచార్య  రాసిన కవిత ' వన్ బై టూ ఛాయ్ దోస్తాన ' ఇక్కడ చదవండి : 

Kandalai Raghavacharya's poem - bsb - opk
Author
First Published Sep 6, 2023, 12:22 PM IST

చార్ మినార్
చౌరస్తాలో ఇద్దరు మిత్రులు 
అనుకోకుండా కలిసి
అనుకోని
వన్ బై టు ఛాయ్ తాగుతుంటే 
నాల్గు దిక్కుల ముచ్చట్లు నాల్కల మీద ఒకటైతున్నై
చల్లారిందీ తెలుస్త లేదు  
ముచ్చట్లే ఎక్కువ 
ఛాయ్ తాగుతుంటే ఇంకిపోదు మరి !

మైత్రీ సంభాషణకు విరామ చిహ్నలే !
పుల్ స్టాపులు లేవు 
వన్ బై టు ఛాయే ఎన్నెన్ని సంగతులు ముందుకు తెన్తున్నదో
 
ఇప్పుడు తాగుతున్నది టీ అయినా 
గతం చేదు ముచ్చట కన్నీళ్లను తెప్పిస్తున్నది
కఠిన అనుభవాలు ఉప్పుతనంగా సముద్రం హోరే  !
మధ్య మధ్య సంతోషం రోజులు వచ్చినపుడు 
టీ లో వేయకుండానే చక్కెర ఎక్కువగా ధారాపాతం 
చెంచలు చెంచలు 

ఇంకో ఛాయ్ తెప్పించుకుంటారేమో
ఎప్పుడు కలుస్తారో మళ్లీ 
సెల్ఫీ తీసుకోక ఎలా కదులుతారు
వన్ బై టు ఛాయ్ సమయం
దోస్తానాగా ఎప్పటికీ జ్ఞాపకంగా 
ఉండి పోవాలిగా 
క్లిక్ క్లిక్ క్లిక్

ఛాయ్ వన్ బై టు
మాటలు పుల్ పుల్ !
 

Follow Us:
Download App:
  • android
  • ios