కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం అధ్యాపకురాలు డాక్టర్ కందాల శోభారాణి కన్నుమూత

కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం  అధ్యాపకురాలు డాక్టర్ కందాల శోభారాణి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె భౌతిక కాయాన్ని రేపు ఉదయం 11 గంటల వరకు హనుమకొండలోని వారి ఇంటిలో వుంచుతారు
 

kakatiya university telugu department professor dr kandala shobha rani passed away

కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం  అధ్యాపకురాలు డాక్టర్ కందాల శోభారాణి ఇక లేకలేరు. తీవ్ర అనారోగ్యంతో ఆమె వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో ఆదివారం తుది శ్వాస విడిచారు. వీరి స్వగ్రామం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట . కాకతీయ యూనివర్సిటీలో తెలుగు విభాగంలో పి.హెచ్.డి.పూర్తి చేసిన ఆమె అధ్యాపకురాలిగా కొనసాగుతూనే మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షురాలిగా పనిచేశారు.

ఆదివాసి, ప్రజల హక్కుల  రక్షణ కోసం తుదికంటా పోరాడారు. అనేక రచనలు , కవిత్వాలు రాసి తెలుగు సాహిత్యాభివృద్ధి వికాసానికి కృషి చేశారు. సమాజ అభివృద్ధికి అడ్డంకిగా మారిన కులం, మతం, దోపిడీ, పీడన, వివక్షత, అణచివేత , పితృస్వామ్య వ్యవస్థ లేని సమ సమాజ స్థాపన కోసం శోభారాణి పరితపించారు. ఈమె భర్త  టి.రమేష్ గతంలో పీడీఎస్‌యూ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన సామాజిక ఉద్యమాల్లో కొనసాగుతున్నారు. శోభారాణి దంపతులకు ఒక బాబు కౌశిక్ ఉన్నారు.

శోభారాణి భౌతిక కాయాన్ని ఆమె కోరుకున్నట్లు కాకతీయ మెడికల్ కళాశాలకు అప్పగించనున్నారు. ప్రజల సందర్శనార్థం ఆమె భౌతిక కాయాన్ని రేపు ఉదయం 11 గంటల వరకు హనుమకొండలోని వారి ఇంటిలో వుంచుతారు. డాక్టర్ శోభారాణి మృతి పట్ల కాకతీయ విశ్వవిద్యాలయం అధికారులు, అధ్యాపకులు ,సిబ్బంది, అరసంతో పాటు పలు సంఘాల నాయకులు, పరిశోధక విద్యార్థులు తమ ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios