శ్రీనివాస్ కు మాతృభాషా దినోత్సవం అవార్డు
ప్రముఖ సాహితీవేత్త, జర్నలిస్టు కె. శ్రీనివాస్ కు మాతృభాషా దినోత్సవం అవార్డు ప్రదానం చేయనున్నారు. అలాగే రవీంద్ర సూరి అనాహత సంకలనం మాతృభాషా దినోత్సవ అవార్డును పొందింది.
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా కళానిలయం సాంస్కృతిక సంఘ సేవా సంస్థ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ పురస్కారాన్ని ప్రముఖ విమర్శకులు, ఆంధ్ర జ్యోతి దినపత్రిక సంపాదకులు కె. శ్రీనివాస్ కు ప్రదానం చేస్తున్నట్టుగా ఈ సంస్థ స్థాపక కార్యదర్శి ఒక ప్రకటనలో తెలియజేశారు.
హైమవతి భీమన్న బోయి సభాధ్యక్షత వహించే ఈ కార్యక్రమం తేదీ 24/02/2021న సాయంత్రం ఆరు గంటలకు శ్రీ త్యాగరాయ గానసభ మెయిన్ హాల్ లో జరుగుతుంది.
అనాహత' కి అస్తిత్వం రాష్ట్రస్థాయి అవార్డు
కవి , సినీ రచయిత, దర్శకుడైన నామాల రవీంద్రసూరి ఇటీవల రాసిన 'అనాహత' అనే కవితాసంపుటికి రాష్ట్రస్థాయి అస్థిత్వం అవార్డ్ వచ్చింది. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్బంగా అస్థిత్వం సేవా సంస్థ తెలుగు సాహిత్య రంగంలో ప్రతిభను గుర్తించి 2021 సంవత్సరానికి గాను రవీంద్రసూరి రాసిన 'అనాహత' ను ఎంపిక చేసారు .
రవీంద్రసూరి చెంబు చినసత్యం అనే సినిమాకు దర్శకత్వం కూడా చేశారు. ఈ అవార్డ్ ను త్వరలో హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జరిగే సభలో కవికి అందజేయనున్నారని నిర్వాహకులు మంజుల తెలిపారు.