ఇరుగు పొరుగు: శంఖా ఘోష్ బెంగాలీ కవిత పేరు
సుప్రసిద్ధ బెంగాలీ కవి శంఖా ఘోష్ కోవిడ్ బారిన పడి 21 ఏప్రిల్ 21 బుధవారం మరణించారు. ఆయన 14 ఏప్రిల్ 21 న కోవిడ్ పాసిటివ్ గా నిర్దారించినప్పటి నుండి తన ఇంట్లో స్వీయ ఐసోలేషన్ లో వున్నారు.
వద్దు, నన్నసలే బలవంతం చేయొద్దు
మాటలు తెరుచుకోనీ
ఒక్కటొక్కటిగా పొరలు పొరలుగా
సూర్యోదయంలా విచ్చుకోనీ
కుండపోత ప్రవాహం
ఓ బండ రాయిని సులభంగా
జనం నుంచి దూరంగా
దోర్లించుకు పోయినట్టు
క్షితిజ రేఖమీద మా పేర్లు
నిశ్సబ్దంగా
చాలా బలహీనంగా
తుడిచివేయబడనీ
నీటి బిందువులోని నీలిరంగు
ముక్కలు ముక్కలై
గడ్డి పైన కురవనీ
మళ్ళీ నన్నెవరూ ఎప్పుడూ
ఏ విధంగానూ బలవంతం చేయొద్దు.
బెంగాలీ మూలం : శంఖా ఘోష్
ఇంగ్లిష్: కళ్యాన్ రాయ్
స్వేచ్చానువాదం: వారాల ఆనంద్
సుప్రసిద్ధ బెంగాలీ కవి శంఖా ఘోష్ కోవిడ్ బారిన పడి 21 ఏప్రిల్ 21 బుధవారం మరణించారు. ఆయన 14 ఏప్రిల్ 21 న కోవిడ్ పాసిటివ్ గా నిర్దారించినప్పటి నుండి తన ఇంట్లో స్వీయ ఐసోలేషన్ లో వున్నారు. 6 ఫిబ్రవరీ 1932న జన్మించిన శంఖా ఘోష్ అనేక రాజకీయ సామాజిక సందర్భాల్లో ప్రజల పక్షాన గొంతెత్తి మాట్లాడారు. ఆయనకు 1977లో కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు,2011లో పద్మభూషణ్, 2016లో జ్ఞానపీఠ పురస్కారం లభించాయి.