Asianet News TeluguAsianet News Telugu

ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు స్మారక సాహిత్య పురస్కారం 2023 కోసం కథా సంపుటాలకు ఆహ్వానం :

అరసం వరంగల్ వారు యేటా ఒక్కో సాహిత్య ప్రక్రియకు ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు స్మారక సాహిత్య పురస్కారం ప్రదానంలో భాగంగా 2023 సంవత్సరానికి కథలకు ఆహ్వానం పలికారు.

Invitation to Story Collections for Acharya Vasireddy Bhaskara Rao Memorial Literary Award 2023 - bsb - opk
Author
First Published Aug 4, 2023, 10:35 AM IST

అరసం వరంగల్ వారు ప్రతి సంవత్సరం ఒక్కో సాహిత్య ప్రక్రియకు ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు స్మారక సాహిత్య పురస్కారం ప్రదానం చేయుట మీకు తెలిసిందే. 2023 సంవత్సరంకు గాను కథలకు ప్రదానం చేయుటకు నిర్ణయించారు.   
*నిబంధనలు *
1) సంపుటాలు మాత్రమే పంపాలి సంకలనాలు(collections) స్వీకరించబడవు. 
2)2019జూలై నుండి 2023 జూన్ వరకు ప్రచురించినవై ఉండాలి.
3)మెుదటి ముద్రణలు మాత్రమే పంపాలి
4)నాలుగు ప్రతులు పంపాలి. 
5)ప్రతులు చేరవలసిన  చివరి తేది 31 ఆగస్టు 2023
6)అన్ని ప్రాంతాల వారు పంపవచ్చు
7)ఎంపికైన గ్రంథకర్తకు అక్టోబర్ 2023లో హనుమకొండలో జరుగు ప్రత్యేక కార్యక్రమంలో  రూ॥5000/- నగదు, శాలువ, జ్ఞాపికతో పురస్కారం ప్రదానం చేస్తారు.
పుస్తకాలు పంపవలసిన చిరునామా : 
నిధి
ఇంటి నెంబర్,2 - 4 - 1449
అశోక కాలని , హనమకొండ 506001 (తెలంగాణ)
పోన్ : 9701000306
రచయితలు సకాలంలో వారి కథా సంపుటాలు పంపవలసిందిగా అరసం వరంగల్ అధ్యక్షులు నిధి, ప్రధాన కార్యదర్శి పల్లేరు వీరస్వామి గారలు ఒక ప్రకటనలో కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios