Asianet News TeluguAsianet News Telugu

సాహిత్య పురస్కార పోటీలు: రచనలను ఆహ్వానించిన రజనీశ్రీ సాహిత్య పురస్కారం జాతీయ సాహిత్య పరిషత్

పుస్తక ఆవిష్కరణ సభ మరికొన్ని ఆసక్తి కరమైన సాహిత్య వార్తలు ఇక్కడ చదవండి :
 

invitation for Raginisri literature competition lns
Author
First Published Jan 20, 2024, 4:00 PM IST

ప్రముఖ నటులు, కవి, నాటక రచయిత మరియు నాట్యాచార్యులు రజనీశ్రీ రాష్ట్ర స్థాయి సాహిత్య పురస్కారం జాతీయ సాహిత్య పరిషత్ - కరీంనగర్ ద్వారా గత మూడు సంవత్సరాల నుండి అందిస్తున్నాం. గత సంవత్సరం కథల సంపుటికి ఈ పురస్కారం అందించడం జరిగింది. ఈ పురస్కారం కింద ప్రశంసా పత్రం, శాలువాతో పాటు 10,116/---(పది వేల నూట పదహారులు) నగదు బహుమతి అందించబడును.

ఈ పోటీకి స్వంతంగా రచించిన నవలలు మాత్రమే పంపగలరు.  అనువాద నవలలు  స్వీకరించబడవు. న్యాయనిర్ణేతలదే తుది నిర్ణయం. ఎంపిక ప్రక్రియపై ఎలాంటి వాదోపవాదాలకు గాని, ఉత్తరప్రత్యుత్తరాలకు గాని తావు లేదని నిర్వాహకులు ప్రకటించారు.

రచయితలు వారి  నవలలు జనవరి1, 2014 నుండి  31 డిసెంబర్ 2023 లోగా ముద్రించబడినవి మాత్రమే నాలుగు ప్రతులు ఈ క్రింది చిరునామాకు 10, ఫిబ్రవరి 2024 లోగా పంపించాలి.  ఆ తర్వాత వచ్చిన ఎంట్రీలు స్వీకరించబడవని నిర్వాహకులు పేర్కొన్నారు.

రచనలు పంపాల్సిన అడ్రస్

గాజుల రవీందర్
ఇంటి నంబర్ 8-3-255/1, రామచంద్రాపూర్ కాలనీ
రోడ్ నంబర్ 12, భగత్ నగర్,  కరీంనగర్ -505001.

మరిన్ని వివరాలకు అధ్యక్షులు గాజుల రవీందర్, ఫోఫోన్ నెంబర్ 9848255525 లలో గాని లేదాప్రధాన కార్యదర్శి నంది శ్రీనివాస్ 9490401861 ఫోన్ నెంబర్లలో కానీ సంప్రదించాలని  జి.వి.శ్యాంప్రసాద్ లాల్, పురస్కార కమిటీ కన్వీనర్ తెలిపారు.

పాలమూరు సాహితి పురస్కారం - 2023కు కవితా సంపుటాల ఆహ్వానం 

తెలుగు సాహిత్యంలో ఉత్తమ వచన కవిత్వాన్ని ఆవిష్కరిస్తున్న కవులకు ప్రతి సంవత్సరం పాలమూరు సాహితీ పురస్కారాలను ప్రదానం చేస్తున్న సంగతి సాహితీవేత్తలందరికి తెలిసిందే. గతంలో ఈ పురస్కారాలను ప్రముఖ కవులు డా. రాధేయ, డా. కాసుల లింగారెడ్డి, డా. పెన్నా శివరామకృష్ణ, కందుకూరి శ్రీరాములు, అంబటి నారాయణ, ఎస్.హరగోపాల్, కోట్ల వెంకటేశ్వర రెడ్డి, డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, చిత్తలూరి సత్యనారాయణ, తగుళ్ళ గోపాల్, డాక్టర్ జెల్ది విద్యాధర్ రావులు  అందుకున్నారు. ఈ పురస్కారం కోసం 2023 సంవత్సరంలో ముద్రితమైన వచన కవితా సంపుటాలను మాత్రమే మూడేసి ప్రతులను   డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, ఇ.నం. 8-5-38, టీచర్స్ కాలని, మహబూబ్ నగర్ - 509001, తెలంగాణ రాష్ట్రం అనే చిరునామాకు జనవరి 31 లోపున పంపాలి. బహుమతి పొందిన ఉత్తమ వచన కవితా సంపుటికి రూ.5,116/- నగదు బహుమతితో పాటు జ్ఞాపికను అందజేస్తారు.
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 
వ్యవస్థాపకులు
పాలమూరు సాహితి అవార్డ్
మహబూబ్ నగర్ - 509001
9032844017
         
                            *            *          **

చెన్నమనేని రంగనాయకమ్మ స్మారక సాహిత్య పురస్కారం 2023 కు రచల ఆహ్వానం 

శ్రీలేఖ సాహితి, వరంగల్లు వారు “చెన్నమనేని రంగనాయకమ్మ గారి స్మారక సాహిత్య పురస్కారము” 2023ను విశిష్టాద్వైత సాహిత్యముకు ఇవ్వడానికి నిర్ణయించినారు. కావున ఈ పురస్కారమునకు విశిష్టాద్వైత సాహిత్య గ్రంధాలను మాత్రమే పంపాలి.  అనువాదాలు పరిశీలించబడవు.  పద్య కావ్యాలు, వ్యాస సంపుటాలు , ఇతర సాహిత్య ప్రక్రియ గ్రంథాలను పంపవచ్చును. అవి తప్పనిసరిగా విశిష్టాద్వైత సాహిత్యమై 2019 - 2023 సంవత్సరాల్లో ప్రచురించబడి ఉండాలి.  కావ్యాలు, సంపుటాలు మాత్రమే పంపాలి. సంకలనాలు పరిశీలించబడవు.  ఏ ప్రాంతం వారైన పంపవచ్చును. రచయితే కాక ఎవరైనా పంపవచ్చును.   పురస్కారం మాత్రమం రచయితకే అందిస్తాము.  పరిశీలన నిమిత్తం నాలుగు ప్రతులు పంపాలి. రచనలు చేరవలసిన చివరి తేదీ 29 ఫిబ్రవరి 2024.  న్యాయనిర్ణేతలదే తుది నిర్ణయం.    పురస్కారం క్రింద ఎంపికైన  రచయితకు ఏప్రిల్ లో(ఉగాదికి) రూ.5000/-, శాలువా, మెమొంటోతో సత్కారం ఉంటుంది.  పుస్తకాలు పంపవలసిన చిరునామా: డాక్టర్ టి. శ్రీరంగస్వామి అధ్యక్షులు, శ్రీలేఖసాహితి,  ఇం.నం. 27-14-53, లిటిల్ సోల్జర్స్ స్కూల్ లేన్, మండల కార్యాలయము ఎదురుగ, హసన్ పర్తి 506371, హన్మకొండ,  తెలంగాణ, ఫోన్ నం. 99498 57955.
 - డా. టి.శ్రీరంగస్వామి అధ్యక్షులు, శ్రీలేఖసాహితి.

                              *        *        **
' చిత్ర కళా ప్రపంచం '  పుస్తక ఆవిష్కరణ సభ 

ఎల్‌.ఆర్‌. వెంకటరమణ రచించిన చిత్రకళా వ్యాసాల పుస్తకం ' చిత్ర కళా ప్రపంచం ' ఆవిష్కరణ సభ జనవరి 27వ తేదీ శనివారం సాయంత్రం 6.00 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్‌ హాల్‌లో జరుగుతుంది. సభలో రావూరి సురేష్‌బాబు, డా. ఏనుగు నరసింహారెడ్డి, డా. రూప్‌ కుమార్‌ డబ్బీకార్‌, డా. ఎస్‌. రఘు, కె. ఆనందాచారి, కూరెళ్ళ శ్రీనివాస్‌ ప్రసంగిస్తారని నిర్వాహకులు ప్రకటించారు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios