Asianet News TeluguAsianet News Telugu

International womens day: పోతుల ఉమాదేవి కవిత "ఆమె"

నేడు అంతర్జాతీయ  మహిళా దినోత్సవం సందర్భంగా జనగామ నుండి పోతుల ఉమాదేవి రాసిన కవిత "ఆమె" ను ఇక్కడ చదవండి.

International womens day: Pothula Umadevi telugu poem
Author
First Published Mar 8, 2022, 1:53 PM IST

ఆమె నేర్వలేని విద్దె లేదు
చెయ్యలేని పని లేదు
ఆమె ప్రతి కదలిక ఒక అద్బుతo
ఆమె ఉపమానానికే ఉపమానo
ఆమె  ఆనందంతో నవ్విన వేళ
ఇల్లంతా నక్షత్రచినుకులు  రాలి  వెన్నెల పారుతుంది
ఆమె నడచిన వేళ
పద్మపాదాలతో రాయoచల నడకలను తలపిస్తూ
హృదయవీణను పులకిoపజేస్తుoది
సహనాన్ని పోతపోసుకొని చదువుల ఒజ్జను తలపిస్తూ
బిడ్డలకై అహరహం శ్రమిస్తూ విద్యా వీచికవుతుoది
ఆమె ఆకలిని ఆలిoగనము చేసుకున్న  దేహాలకు అన్నపూర్ణై కడుపులు నిoపుతూ
తృప్తిదేవతై మమకారపు ముద్దవుతుoది
ఆమె అన్యాయాన్ని ఎదిరించేవేళ
పరాక్రమాన్ని పరిపరివిధాల ప్రదర్శిస్తూ
ప్రచండ పిడుగవుతుoది
ఆమె ఓడిపోయేవేళ
ఓటమికి వెరవక తనువును అర్పిoచు
సమిధగానైనా.....

Follow Us:
Download App:
  • android
  • ios