గోపగాని 'శతారం ' కు రాష్ట్ర స్థాయి సాహిత్య పురస్కారం
స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న కవి, రచయిత, తెలుగు భాషోపాధ్యాయుడు గోపగాని రవీందర్ రాష్ట్ర స్థాయి సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. నిజాం వెంకటేశం జన్మదినం సందర్భంగా ఈ నెల 14 న హైదరాబాద్లో ఈ పురస్కారాల ప్రదానోత్సవం ఉంటుంది.
స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న కవి, రచయిత, తెలుగు భాషోపాధ్యాయుడు గోపగాని రవీందర్ రాష్ట్ర స్థాయి సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. తొలిసారిగా ప్రవేశ పెట్టిన నిజాం వెంకటేశం స్మారక సాహిత్య పురస్కారానికి గోపగాని రవీందర్ రచించిన వచన కవిత్వ విమర్శ వ్యాసాల పుస్తకం ' శతారం' ను ఎంపిక చేసినట్లుగా అవార్డు కమిటీ కన్వీనర్, సామాజిక తత్వవేత్త, తెలంగాణ బీసీ కమిషన్ తొలి చైర్మన్ బి.ఎస్. రాములు ప్రకటించారు. నిజాం వెంకటేశం జన్మదినం సందర్భంగా ఈ నెల 14 న హైదరాబాద్లో ఈ పురస్కారాల ప్రదానోత్సవం ఉంటుందని ఆయన తెలిపారు. రాష్ట్ర స్థాయి సాహిత్య పురస్కారం పట్ల పలువురు సహచర ఉపాధ్యాయులు, కవులు,రచయితలు, కళాకారులు అభినందనలు తెలిపారు.