Asianet News TeluguAsianet News Telugu

ఘణపురం దేవేందర్ కవిత : తలరాత

దేశానికి సార్వభౌమత్వం ఉంటుంది నీచంగా పాలించే వానికి ఉండదు అంటూ నిజామాబాద్ నుండి ఘణపురం దేవేందర్ రాసిన కవిత  ' తలరాత ' ఇక్కడ చదవండి : 

Ganapuram Devender Poem - bsb - opk
Author
First Published Oct 10, 2023, 12:17 PM IST

అబద్దానికి సిగ్గు ఉంటుంది
ఆడే వానికి ఉండదు
పదవికి గౌరవం ఉంటుంది
అడ్డదారిలో చేపట్టే వానికి ఉండదు
మతంలో హితం ఉంటుంది
ఉన్మాదంతో చెలరేగే వానికి ఉండదు
సంస్కారానికి తేజస్సు ఉంటుంది
నటించేవానికి ఉండదు
మాటకు నీతి ఉంటుంది
తప్పుడు మనిషికి ఉండదు
నోటుకు విలువ ఉంటుంది
అవినీతిగా సంపాదించే వానికి ఉండదు
ధర్మానికి క్రమశిక్షణ ఉంటుంది
స్వార్థానికి వల్లించే వానికి ఉండదు
దేశానికి సార్వభౌమత్వం ఉంటుంది
నీచంగా పాలించే వానికి ఉండదు
కవిత్వానికి వ్యక్తిత్వం ఉంటుంది
గొప్ప కోసం రాసేవాడికి ఉండదు
ప్రజాశక్తికి విచక్షణ ఉంటుంది
ప్రయోగించే వేళ తడబాటు 
కొంపముంచుతుంది
ఉద్వేగం ఒక బలహీనత
కక్కిరిబిక్కిరిగా మారుతుంది 
ప్రజల తలరాత

Follow Us:
Download App:
  • android
  • ios