ప్రజా కవి కాళోజీ కుమారుడు కాళోజీ రవికుమార్ (70 వయసు) ఈరోజు అనారోగ్యంతో మరణించారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రవికుమార్ ఈరోజు ఉదయం తుది విశ్వాస విడిచినట్లు కాళోజీ ఫౌండేషన్ తెలిపింది.
ప్రజా కవి కాళోజీ కుమారుడు కాళోజీ రవికుమార్ (70 వయసు) ఈరోజు అనారోగ్యంతో మరణించారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రవికుమార్ ఈరోజు ఉదయం తుది విశ్వాస విడిచినట్లు కాళోజీ ఫౌండేషన్ తెలిపింది. రవి కుమార్ కాళోజీకి ఏకైక సంతానం.
Add Asianetnews Telugu as a Preferred Source

రవి కుమార్ కాళోజీ ఫౌండేషన్ సభ్యుడిగా కొనసాగారు. వారి మరణం పట్ల కాళోజీ ఫౌండేషన్ మరియు మిత్రమండలి సభ్యులు నాగిళ్ళ రామశాస్త్రి, జీవన్ కుమార్ , డా.అంపశయ్య నవీన్, బి.నర్సింగరావు, విఆర్ విద్యార్థి, పొట్లపల్లి శ్రీనివాసరావు, జితేందర్ రావు, ఆచార్య బన్న అయిలయ్య, ఆగపాటి రాజు కుమార్, సిరాజుద్దీన్, బిల్ల మహేందర్ తదితరులు వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.
