కవి, రచయిత జంగ వీరయ్య (వీత్రిజ) ఇక లేరు
సాహితి పిపాసి, సాంస్కృతిక బాటసారి, సామాజిక కెరటం, జనచైతన్యశీలి కవి, రచయిత జంగ వీరయ్య (వీత్రిజ) ఈ రోజు ఉదయం జనగామ ఏరియా ఆసుపత్రిలో అనారోగ్యంతో మరణించారు.
సాహితి పిపాసి, సాంస్కృతిక బాటసారి, సామాజిక కెరటం, జనచైతన్యశీలి కవి, రచయిత జంగ వీరయ్య (వీత్రిజ) ఈ రోజు ఉదయం జనగామ ఏరియా ఆసుపత్రిలో అనారోగ్యంతో మరణించారు. ప్రాసకెరటాలు,అక్షర సమరం, అక్షర సంచారం వీరి రచనలు.
జంగ వీరయ్య (వీత్రిజ) అకాల మరణం జనగామ సాహితీ లోకాన్ని తీవ్రదిగ్భ్రాంతికి గురిచేసింది. ఎక్కడ సాహిత్య సభలు జరిగినా అక్కడ వాలిపోయి తన మాటే కవితాక్షరాలుగా వినిపించేవాడు. తరిగొప్పుల మండల సాధకుడై నిలిచి తాను పుట్టిన తరిగొప్పుల గడ్డకు సాహిత్య శిఖరమై వెలిగాడు. ' విత్రిజగా ' సాహిత్య వెలుగును పంచాడు. మూడు కవిత్వ సంకలనాలు వెలువరించి మంచి కవిగా గుర్తింపు తెచ్చుకున్న జంగ వీరయ్య (వీత్రిజ) మృతికి ఉమ్మడి వరంగల్ జిల్లా రచయితలు, కవులు భౌతికంగా దూరమైనా తన సాహిత్య అక్షరాల్లో ఎల్లప్పుడూ సజీవంగానే జీవించి ఉంటాడని నివాళులు అర్పించారు.
' తరిగొప్పులనే వరికుప్పలుగా మార్చినంటు ' గేయమై నిలిచిన జంగ వీరన్న తెరసం, జరసం, అరసం, విరసం సంస్థలతో సాహిత్యానుబంధం పెంచుకున్నాడు. జంగ వీరన్న మరణం తమను కలచివేసింది అంటూ పలు సాహితీ సంస్థలు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశాయి.