Asianet News TeluguAsianet News Telugu

పలకరింత: తుర్లపాటి రాజేశ్వరితో రమాదేవి బాలబోయిన ముచ్చట

ప్రముఖ సాహితీవేత్త తుర్లపాటి రాజేశ్వరిని రమాదేవి బాలబోయిన పలరించారు. ప్రముఖ తెలుగు రచయిత్రితో ముచ్చటను రమాదేవి బాలబోయిన పంచుకున్నారు.

Face to face: Ramadevi Balaboina with Thurlapati Rajeswari
Author
Hyderabad, First Published Jan 7, 2020, 5:08 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

డా..తుర్లపాటి రాజేశ్వరి గారు...రిటైర్డ్ ప్రొఫెసర్ ..బరంపురం...ఒరిస్సా గారు...

మొన్న అనుకోకుండా వరంగల్ సందర్శనార్ధం వచ్చారు...వారి నుండి ఫోన్ కాల్ అందుకోవడం ఆలస్యం..వెళ్ళి కలిసాను..ఓసారి ఓ కవిత్వకార్యశాలలో ఆవిడ సాహిత్యంపై పత్రసమర్పణ చేసిన సమయంలో ఆవిడ గురించి నెట్ లో సెర్చ్ చేసినపుడు .ఆవిడ గురించి చదివాను....అనుకోకుండా అనేక..వ్యాసాలు ,కవితలు,అనువాదాలు ,నవలలు,విమర్శగ్రంథాలు వ్రాసిన వీరిని కలుసుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది..

చాలా పెద్దావిడ..తాను మాట్లాడే ప్రతీమాట చాలా ప్రేమపూర్వకంగా మాట్లాడటం...కాసేపు వారితో సాహీతీగోష్ఠిజరపడం నాకు మంచి స్మృతులు...నా ప్రాణం వాసన వారికి అందజేసి...వారు ప్రేమతో ఇచ్చిన గాయాలచెట్టు కవితాసంపుటి..వ్యాసనీరాజనం సాహిత్యవ్యాసాలు ఇంటికి తెచ్చుకున్నాను...

అలాగే తననూ హన్మకొండ రాజరాజనరేంద్రాంధ్ర భాషానిలయానికి తీసుకెళ్ళాను...అక్కడ వి.ఆర్ విద్యార్ధి సర్ పై   పాతూరి రఘురామయ్య గారు రాసిన" కల నుండి ఇలకు" గ్రంథావిష్కరణ జరుగుతోంది...ఆ సందర్భంగా అంపశయ్యనవీన్ సర్ ,రామా చంద్రమౌళిసర్ ,గిరిజామనోహర్ రావు సర్ ,మొదలగు పెద్దలందరినీ ఆవిడ కలుసుకున్నారు...వరంగల్ దర్శనీయస్థలాలను దర్శించిన దానికన్నా రమాదేవి ఇలా  అందరినీ కలిసే అవకాశం కల్పించిందంటూ చేసిన ప్రశంస చాలా సంతృప్తినిచ్చింది...

సాహిత్యాభిలాష ,సాహితీ ప్రపంచపు మార్గదర్శకులైన పెద్దలను కలుసుకునే అదృష్టం ఎందరికుంటుంది చెప్పండి... 

#గాయాలచెట్టు కవితాసంపుటి 2005

తెలుగు ప్రాంతానికి దూరంగా ఒరిస్సాలో నివసిస్తూ విద్యాశాఖలో సెవలందిస్తున్న వీరు తెలుగుభాష సేవను వదిలిపెట్టలేదు..పురుషాధిక్యసమాజాన్ని ప్రశ్నించేతత్వంతో సాగిన కవితలతో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నించిన వీరి సాహిత్యం ఇప్పటీ పరిస్తితులకు సవాల్ విసురుతూనే ఉంటుంది...శతాబ్ధాల నాగరికతా ప్రయాణంలో మానవపరిణామ క్రమంలో స్త్రీ పురుషుని కంటే కాస్త ఎక్కువగానే విధులన్నీ నిర్వర్తిస్తొంది...అయినా పరాభవపువెతలను బహుమతిగా మూటగట్టుకుంటూనే ఉంది..స్త్రీని ఆటవస్తువుగా భావించి అమానవీయంగా ప్రవర్తించే దుష్టులను వెంటాడే జ్వలించే చక్రం...ఓ జ్వలితజ్వాలగా  గురితప్పని సుదర్శన చక్రంలా ప్రయోగించారు..రాజేశ్వరిగారు

గుడియా...ఓ గుడియా..కవితలో "ఓ స్త్రీ...నీకు ఒక మనసుండకూడదు...హక్కులగురించి మాటాడకూడదు"అంటూ ఆమెకుటుంబసభ్యులు-మతపెద్దలు ఆమె జీవితంతో ఆడుకునే సంఘటననను మన కళ్ళ ముందుంచుతారు..ఈ తమోమయ నిశిలో నక్షత్రతోరణాలే నీకు బాసట..నెలవంక కాంతులే నీకు ఊరట అంటూ అభాగినికి ప్రకృతే అమ్మఒడి అవుతుందంటారు రాజేశ్వరి గారు

మృత్యుపిశాచి కెరటాల ఉరితాళ్ళతో కమ్మనిజీవితానికి క్రూరంగా ముగింపుపలికింది..అంటారు...కన్నీటిపాట కవితలో,..నాసా అంతరిక్ష వ్యోమనౌకలో విశ్వవీధుల కెగీరిన విజ్ఞానఖని కల్పనాచావ్లాకి స్మృతిదీపనివాళి ఇచ్చారు..

స్వార్ధం జడలు విరబోసుకున్న చోట అనుబంధాలను తక్కెడలో తూచే వాళ్ళు...పెదాలపై నవ్వులు నటిస్తూ సువాసనలే లేనికాగితపు పూలను పూయిస్తారని రాత్రిపూవుని పూయించారు వీరు..పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళడంతోనే స్త్రీ తననూ తాను ఎలా మార్చుకుంటుందో....కూతూరు నుంచి..భార్య..కోడలు,తల్లి..ఇలా.అనేక పాత్రలలో ..ఒదిగిపోతూ స్వీయకోరికలు సమాధిచేసుకుంటూ జీవచ్ఛవంగా మారే స్త్రీ వ్యధను గొంతు ముడి వీడేనా కవితలో చెప్తారు..
వీరి ఒక్క సంపుటిలోనే ఎన్నో గాయాలు కనిపించాయి...జీవితాన్ణి కాచి వడపోసిన మేథోసంపన్నురాలు వయోధికాలైన వారి సాహిత్యమూ ప్రపంచాన్ని చుట్టివచ్చిందనుటలో అతిశయోక్తిలేదు...

#వ్యాసనీరాజనం...సాహిత్యవ్యాసాలు - 2019  -  డా..సి .నారాయణరెడ్డి గారి నుండి ఎన్నో ప్రశంసల లేఖలందుకున్న వీరు ఈ సంపుటిని వారికే అంకితం చేసారు.  వివిధ పత్రికలలో అచ్చైన వ్యాసాలను ఇందులో చేర్చారు.  తులనాత్మక అధ్యయనం, వస్తు విశ్లేషణ చేయడం వంటివి నేర్చుకోవాలనే వారికి ఇది ఉపయుక్తగ్రంథంగా చెప్పుకోవచ్చు.  శివారెడ్డి గారి సాహిత్యం,గోపిగారి సాహిత్యం, సుజాతారెడ్డి, కరుణశ్రీ, రావిశాస్త్రి, చాసో మరియు గురజాడ గార్ల సాహిత్యమూ  పరిశీలన వీరి గ్రంధసారాంశముగా ఒరియా-తెలుగు సాహిత్య సంబంధాలను తెలుపే వ్యాసాలు చేర్చబడిన గ్రంధమిది.

చక్కని సాహిత్యాన్నీ ఆశీర్వాదములతో కలిపి అందజేసిన వారికి శతనమస్సులతో...

Follow Us:
Download App:
  • android
  • ios