మత్తు ఎక్కగూడదని కోరుకొని మందు తాగిన వాడి పరిస్థితి రాజుది అంటూ ఏనుగు నరసింహారెడ్డి రాసిన  కవిత  ' స్వస్వరూపం ' ఇక్కడ చదవండి : 

ఏ ఉన్ముఖీకరణ లేని నీతి వాక్యంలా 
మాధ్యమాలు 
మనోవీదుల వెంట 
చల్లగాలని ప్రవహింపజేస్తాయి

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

రాజు మారిండు
రాజ్యం మారుతుందని 
పవనాలెలా వీస్తున్నాయో చూడండని 
గాలి భాషను 
అందంగా అనువాదం చేసి పెడతాయి 
పదేపదే మంత్రాంగ ప్రదక్షణం చేసేవాళ్లు 
వెంటనే వేషాలు మార్చుకుంటారు
నటనలు వినూత్నంగా ప్రదర్శిస్తూ 
కొలువు కూటాలు చేరుకుంటారు
రాజు వేషగాళ్లను అనుమానాస్పదంగానే ఆహ్వానిస్తాడు 
మత్తు ఎక్కగూడదని కోరుకొని 
మందు తాగిన వాడి పరిస్థితి రాజుది 
అవును వాళ్ళ స్వభావం వాళ్ళదే
రాజ స్వభావం మెల్లమెల్లగా 
అలాగే మారుతుంది
రాజ్యం మునప్పటి రూపాన్ని తొందర్లోనే సంతరించుకుంటుంది