Asianet News TeluguAsianet News Telugu

డా. వాసా ప్రభావతి స్మారక కవితల పోటీ ఫలితాలు

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలయిన సందర్భంగా అమృతోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో దేశభక్తి -  పురోగతి - జాతీయత ప్రధానాంశాలుగా పాలపిట్ట వాసా ఫౌండేషన్‌ సంయుక్తంగా కవితల పోటీ నిర్వహించాయి. ఆ ఫలితాల వివరాలను ఇక్కడ చదవండి : 

Dr. Vasa Prabhavathi Memorial Poetry Competition Results - bsb
Author
First Published May 23, 2023, 2:42 PM IST

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలయిన సందర్భంగా అమృతోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో దేశభక్తి -  పురోగతి - జాతీయత ప్రధానాంశాలుగా పాలపిట్ట వాసా ఫౌండేషన్‌ సంయుక్తంగా కవితల పోటీ నిర్వహించాయి.  డా. వాసా ప్రభావతిని స్మరించుకుంటూ జరిపిన ఈ  పోటీకి విశేషమైన స్పందన వచ్చింది. పోటీకి వచ్చిన కవితలని క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ కవితల పోటీకి న్యాయనిర్ణేతగా ప్రముఖ విమర్శకులు ఎం. నారాయణశర్మ వ్యవహరించారు.    జూన్‌ 6వ తేదీన హైదరాబాద్‌లోని చిక్కడపల్లి త్యాగరాయగానసభలో జరిగే సభలో బహుమతి ప్రదానోత్సవం ఉంటుంది. 

ఈ కవితల పోటీ ఫలితాల వివరాలు: 
మొదటి బహుమతి: శోకం లేని లోకం - నెల్లుట్ల రమాదేవి 
రెండో బహుమతి: రేపటి సూర్యోదయం కోసం - పల్లా రోహిణీకుమార్‌ 
మూడో బహుమతి: అమృతోత్సవాల ప్రగతి స్ఫూర్తి - రాజా మానాపురం చంద్రశేఖర్‌
 
ఎనిమిది కవితలకు ప్రత్యేక బహుమతులు : 

1. అభినవ భారతి - కరిపె రాజ్‌కుమార్‌
2. సత్యమేవ జయతే - స్వప్న మేకల 
3. వెలుగులు నింపుదాం- అల్లాడి శ్రీనివాస్‌ 
4. వజ్రోత్సవ కానుక - దాసరి మోహన్‌ 
5. నా గుండె కాల్చుకుతినే గుడ్డె - వేల్పుల రాజు 
6. పొడిచే పొద్దు - బొప్పెన వెంకటేష్‌ 
7. స్వేచ్ఛ లేని ప్రాణం మట్టిపటం - శ్రీకాంత్‌ బింగి 
8. మట్టి తిలకం - బి. కళాగోపాల్‌

ఈ పోటీకి కవితలు పంపించిన కవులకు ధన్యవాదాలు తెలియజేస్తూ పోటీలో ఎంపికయిన  కవితలని పాలపిట్ట పత్రికలో ప్రచురిస్తున్నట్టుగ పాలపిట్ట ఎడిటర్‌ గుడిపాటి ఒక ప్రకటనలో తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios