డా. వాణీ దేవులపల్లి కవిత : పునర్నవం

దుఃఖానంతర దృశ్యం స్నేహ హస్తమైనప్పుడు నా కళ్ళల్లో చిప్పిల్లిన కన్నీళ్ళిప్పుడు ఆనంద భాష్పాలే నేస్తం!! అంటూ
హన్మకొండ నుండి  డా. వాణీ దేవులపల్లి రాసిన కవిత ఇక్కడ చదవండి : 

Dr. Vani Devulapalli's poem - bsb

జీవితం మళ్లీ కొత్తగా స్పర్శించి
ఆత్మీయ కరచాలనమైనప్పుడు
బతుకు విలువేంటో తెలిసింది!!

మేఘ మల్ హర్ రాగమై
మళ్లీ కొత్తగా వర్షించి..
దుఃఖానంతర దృశ్యం
స్నేహ హస్తమైనప్పుడు
పునర్నవమైంది హృదయం!!

ఆ మోడు చిగురించి పుష్పించి
ఆశల హరివిల్లై పలకరిస్తే
మనసు రాగ రంజిత పాటై పల్లవించింది!!

ఆ అనుభూతుల పూలచెండ్లు
జ్ఞాపకాల పరిమళమై పరవశించి
గుండెలను ఆర్తిగా అపురూపంగా
హత్తుకుంటే...
ఒట్టు!
నా కళ్ళల్లో చిప్పిల్లిన కన్నీళ్ళిప్పుడు
ఆనంద భాష్పాలే నేస్తం!!

-డా. వాణీ దేవులపల్లి
9866962414

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios