కన్నడ కవితకు తెలుగు అనువాదం నగలు

డా. ఆర్. ఉమా శర్మ , బెంగళూరు నుండి కన్నడ కవితను తెలుగులోకి అనువదించారు.  ఇక్కడ చదవండి

Dr Uma Sharma  translates Kannada poem into Telugu

బంగారపు నగలెందుకమ్మా?
గుచ్చుకుంటాయి వద్దమ్మా!
రంగురంగుల బట్టలెందుకమ్మా?
మట్టిలొ ఆడనివ్వవు కదమ్మా!
ఎందుకంటే కనిపిస్తావు అందంగా, చాలా అందంగా అని చెబుతావు!
అందంగా ఎవరికి కనిపించాలి , చెప్పమ్మా?
చూసేవారికి అందంగా అనిపిస్తుంది, ఆనందానిస్తుంది!
కానీ, నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది!
ఈ నా బాల్యం , నీ మాతృత్వం
ఇవే నాకు నగలమ్మా!
నీకు నేను నగ, నాకు నువ్వు నగ,
ఇక వేరే నగలెందుకు చెప్పమ్మా?

               మూలం- (కన్నడ) - కువెంపు
               హిందీ కవిత – డా. ఎమ్. విమల
              తెలుగు అనువాదం- డా. ఆర్. ఉమా శర్మ

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios