యుద్ధం  మృత్యువై క‌బ‌ళించే భ‌యోత్పాత విషాదం అంటూ డా. తిరున‌గ‌రి శ్రీ‌నివాస్ రాసిన కవిత  ' యుద్ధ విషాదం... ' ఇక్కడ చదవండి :  

ఉన్మాదం
పుక్కిలించిన 
ఉక్రోశ‌మే యుద్ధం 
వేల త‌ల‌లు 
నెత్తురోడితే 
పూల క‌ల‌లు కాలిపోతే 
స్వ‌ప్నాలు శిథిలాలైతే 
ప్రాణాలు ఆవిరైతే 
నివాసాలు స్మ‌శానాలైతే 
అదే యుద్ధ విషాదం
మృత్యువై క‌బ‌ళించే భ‌యోత్పాతం