Asianet News TeluguAsianet News Telugu

డా. తిరునగరి శ్రీనివాస్ కవిత : కవితా రవి

నేడు శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా డా. తిరునగరి శ్రీనివాస్ రాసిన కవిత  ' కవితా రవి ' ఇక్కడ చదవండి : 

Dr. Thirunagari Srinivas poem : Kavita Ravi - bsb
Author
First Published Jun 15, 2023, 1:55 PM IST

అక్షరానికి అగ్ని తొడిగి
కవిత్వాన్ని ఆయుధంగా 
నిలిపిన తపస్వి

జనహిత మార్గంలో
ఆలోచనలను మలచిన
ప్రగతిశీల మార్గదర్శి

రక్త ప్రవాహసిక్తమైన లోకానికి
క్రాంతి దారుల్ని చూపిన
దార్శనిక కవిత్వ యోగి

రణమైన జీవానాల 
వ్యధల్ని అవలోకించి
గెలిచి నిలిచే తీరుల్ని
ప్రబోధించిన జనం కవి

ప్రపంచ బాధ ఆయనదే
కన్నీళ్ళు కష్టాలు ఆయనవే
విముక్తి మార్గాలు
ఆయన చూపినవే

పరపీడన నుండి నరజాతి
విముక్తిని కాంక్షించిన
మహాప్రస్ధాన మహాకవికి
సాటిలేని కవితారవికి వందనం

Follow Us:
Download App:
  • android
  • ios