డా తిరున‌గ‌రి శ్రీ‌నివాస్ కవిత : మ‌ళ్ళీ...

ప‌దాలను స‌వ‌రించి పెన‌వేసుకున్న వాక్యం స్వేచ్ఛ‌గా మారి నిబ్బ‌రాన్ని వ‌ర్షించింది అంటూ డా. తిరున‌గ‌రి శ్రీ‌నివాస్ రాసిన కవిత "  మ‌ళ్ళీ... " ఇక్కడ చదవండి : 

Dr Thirunagari Srinivas Poem - bsb

ప‌క్షి ఎగిరిపోయింది
చీకటి తెర తొల‌గింది
వెలుగు కిర‌ణం
స్వ‌ప్న‌ద్వార‌మై వెలిగింది
నిశ్శ‌బ్దం అంత‌రించి
మాట ప్ర‌తిధ్వ‌నించింది
చెమ‌ట చుక్క కొత్త రెక్క తొడుక్కుంది
 శిఖ‌ర‌పుటెత్తును త‌ల‌చి త‌ర‌చి
పాదం ఆత్మ‌ప‌రిమ‌ళ‌మై అడుగేసింది
ప‌దాలను స‌వ‌రించి పెన‌వేసుకున్న వాక్యం
స్వేచ్ఛ‌గా మారి నిబ్బ‌రాన్ని వ‌ర్షించింది
దూరంగా వెళ్లిపోయిన మూలాలు
బంధాలై తిరిగొచ్చిన అనుభూతి
ఊపిరుల‌న్నీ మోక‌రిల్లి
వెలుతురు రాలిప‌డిన అనూహ్య స్థితి
ఒక్కొక్క క్ష‌ణం
మేటి శ‌కలాల‌ను ఒడిసిప‌ట్టిన మ‌హాకావ్యం
అంత‌ర్గ‌త ధార‌లు
శాశ్వ‌త‌మై విక‌సించే ఆయుధాలు
గెలుపోట‌ముల గాయాలు
సూర్యుళ్ళ్తె నిద్ర లేచే పొద్దుపొడుపులు
కాలాన్ని చీల్చుకుంటూ సాగేదే జీవితం
ప్ర‌తి విన్యాసంలోనూ
స‌రికొత్త‌గా పుట్ట‌కా త‌ప్ప‌దు...!

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios