Asianet News TeluguAsianet News Telugu

డా.టి.రాధాకృష్ణమాచార్యులు కవిత : అడవి సింగిడి

అడవి ఓ గంభీర మాటలాంటి మౌనం స్వచ్ఛ స్వేచ్ఛా జీవన కావ్యం అంటూ డా.టి.రాధాకృష్ణమాచార్యులు రాసిన కవిత  ' అడవి సింగిడి ' ఇక్కడ చదవండి :

dr t radha krishnamacharyulu poem ksp
Author
First Published May 20, 2023, 2:44 PM IST | Last Updated May 20, 2023, 2:48 PM IST

పెల్లుబికిన చైతన్యం 
పచ్చపచ్చని తీగల్ని తాకే ఆకాశం అడవి 
ఆకులు రాసిన మౌనం
ఆకుపచ్చ తీగలో అక్షర జీవం
కొమ్మల్ని అల్లుకున్న నీడ
విశాల ప్రవాహ హృదయంలో అడవి

జీవరాశి వేటాడిన ఆకలి 
దాహం తీరిన జలాలది
ఇక ఆటంతా 
జాలీ దయా మరిచిన వేటలో
అడవి

జీవిని పట్టిన పులి నోరు  
గాండ్రించి దులిపే సింహం జూలు
విష సర్పాల సయ్యాటలు
ఇప్పపూల పుప్పొడి పరిమళించే వెన్నెల సోయగం 
ఆకాశంలో మెరిసే ఆకుపచ్చ అందాలు
ఊహల ఆకులు ఊగే జలపాతాలు  
ఆశల శోభలన్నీ ప్రకృతిలో ఆవిష్కృతం

అడవి ఓ గంభీర మాటలాంటి మౌనం 
ఒక దయార్ద్ర నిశ్శబ్ద స్వరం
రవివర్మ గీసిన సింగిడి
నడిచిన కలల కరచాలనం
అది అద్భుత పులకింతల కళ
ఆంక్షల ప్రాకార ఆమని కాదు
స్వచ్ఛ స్వేచ్ఛా జీవన కావ్యం 
పులి వేటు పాము కాటు ఎరిగిన వేటలో 
రక్షిత జీవ జల జంతు వృక్షజాలం
మానవాళి ఆరోగ్యగవాక్షం
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios