‘గంధకుటి’ సౌజన్యంతో డా॥ భట్టిప్రోలు దుర్గాలక్ష్మీ ప్రనన్న స్మారక వచనకవితల పోటీని కవిసంధ్య నిర్వహిస్తున్నది.  ఆ వివరాలు ఇక్కడ చదవండి : 

మార్చి 21, ప్రపంచ కవితా దినోత్సవ సందర్భంగా, సుధామగారి ‘‘ఓసారి చూడండి ... అంతే’’ (వాట్సప్ ప్రసారసంచిక)2024మార్చి లో సమాపన సందర్బంగా ‘గంధకుటి’ సౌజన్యంతో డా॥ భట్టిప్రోలు దుర్గాలక్ష్మీ ప్రనన్న స్మారక వచనకవితల పోటీని కవిసంధ్య నిర్వహిస్తున్నది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ప్రథమ బహుమతి : 3000/-రూ - ద్వితీయ బహుమతి : 2000/- రూ.; తృతీయ బహుమతి : 1000/-రూ. ప్రోత్సాహక బహుమతులు 5 కవితలకు ఒక్కొక్క దానికి 500/-రూ. కవితల ఇతివృత్తం వర్తమాన సామాజిక పరిస్థితులను ప్రతిబింబించేది అయివుండాలి. కవిత రెండు పేజీల నిడివికి మించరాదు. ఒక కవి ఒక కవితను మాత్రమే పంపాలి. కవితలు పోస్టు, కొరియర్ ద్వారా మాత్రమే పంపాలి . ఈ మెయిల్, వాట్సప్‌లో పంపిన కవితలు పరిశీలించబడవు.
కవితలు పంపడానికి చివరితేదీ : 31 జనవరి 2024.
కవితల ఎంపికలో న్యాయనిర్ణేతలదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఎటువంటి సంప్రదింపులకు అవకాశం లేదు.
బహుమతులు మార్చి 21 వ తేదీన జరిగే ప్రపంచ కవితా దినోత్సవ సభలో ప్రదానం చేయబడతాయి. 
కవితలు పంపవలసిన చిరునామా: 
దాట్ల దేవదానం రాజు, 
కన్వీనర్, కవితల పోటీ, 
జక్రయనగర్, యానాం(పోస్ట్) 
వయా: కాకినాడ 
తూర్పుగోదావరి జిల్లా- ఆంధ్రప్రదేశ్, 
పిన్:533464.
ఫోన్:9440105987.