Asianet News TeluguAsianet News Telugu

దండమూడి శ్రీచరణ్ కవిత : నవ్య భగవద్గీత!

నీ చెమటతో చెరిపేసి నీ నుదుటి రాత - ఈ పుడమికే నేర్పవోయ్ నవ్య భగవద్గీత!! అంటూ దండమూడి శ్రీచరణ్ రాసిన  కవిత  ' నవ్య భగవద్గీత! ' ఇక్కడ చదవండి : 

Dandamudi Sricharan poem - bsb - opk
Author
First Published Oct 11, 2023, 1:07 PM IST | Last Updated Oct 11, 2023, 1:09 PM IST

నువ్వంటే కాదులే ఒట్టి చేతి రేఖ
వెయ్యేళ్ళ దాక వినాలి జగతి నీ కేక!
బూడిదయ్యి మిగలరాదు నీ పుట్టుక
నిన్నందరూ తలవాలి చివరి శ్వాస దాక!
వేరెవ్వరో చేసిన దారి విడిచినాక
సరికొత్తగా అడుగేసి చూపు వేడుక!
ఆ సూర్యుడెంత దూరమో లెక్క వేయబోకు
నీ కంటి పాప చాటున నిప్పు దాచుకోకు!
ఏ మైళ్ళ గమ్యమో నిన్ను పిలిచినాక
సవాలుగా పరిగెత్తవోయ్ ఆ చివరిదాక!
కష్టాల సాగరాలు నిను ముంచివేసినా
పిడికిళ్ళు ఎత్తి ఈదవోయ్ ఆ గట్టు దాక!
నరాలలో నెత్తురే నిన్ను నడుపుగాక
కరాలలో సత్తువే చూపవోయిక!
నీ చెమటతో చెరిపేసి నీ నుదుటి రాత
ఈ పుడమికే నేర్పవోయ్ నవ్య భగవద్గీత!!
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios