తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (TPJAC) జనగామ జిల్లా ఆధ్వర్యంలో జనగామ నియోజక వర్గ స్థాయి సదస్సు ఆదివారం అనగా తేది 19-11-2023న   సాయంత్రం 4 గంటలకు గాయత్రి ఫంక్షన్ హాల్, సిద్దిపేట రోడ్, జనగామలో నిర్వహించబడుతోంది.  పూర్తి వివరాలు ఇక్కడ చదవండి : 

రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజాస్వామిక తెలంగాణ సాకారం చేసుకోవడంలో మేధావుల బాధ్యత , గడిచిన పదేండ్ల తెలంగాణలో ప్రజలకు అందినదేమిటి? ఉద్యమ ఆకాంక్షలు ఏ మేరకు సాకారమయ్యాయి? తదితర అంశాలపై చర్చించడానికి TPJAC జనగామ జిల్లా ఆధ్వర్యంలో జనగామ నియోజక వర్గ స్థాయి సదస్సు ఆదివారం అనగా తేది 19-11-2023న సాయంత్రం 4 గంటలకు గాయత్రి ఫంక్షన్ హాల్, సిద్దిపేట రోడ్, జనగామలో నిర్వహించబడుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

TJS అధ్యక్షులు ప్రోఫెసర్ కోదండ రామ్, TPJAC కోకన్వీనర్ కన్నెగంటి రవి, TPJAC కోకన్వీనర్ అంబటి నాగయ్య , మాజీ శాసనసభ్యులు సి హెచ్. రాజారెడ్డి (సిపిఐ)లు ప్రసంగించే ఈ సభకు ప్రజాస్వామిక వాదులు, మేధావులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు, ప్రజా ప్రయోజనాలను కాంక్షించే వారందరూ తప్పక హాజరు కావాలని TPJAC బాధ్యులు ఏ నర్సింహారెడ్డి కోరుతున్నారు.