CAA: రచయితల రౌండ్ టేబుల్ సమావేశం, నిరసన గళం
సిఏఏకు నిరసనగా రేపు ఆదివారం ఉదయం పది గంటలకు విజయవాడలో రచయితలు, ఆలోచనాపరుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానంతరం కవురు, రచయితలు చేసిన సంతకాలను కేంద్రానికి పంపిస్తారు.
విజయవాడ: కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ఉందని రాష్ట్రంలోని పువురు రచయితలు, కవులు నిరసిస్తు న్నారు. ఇందులో భాగంగానే నేటి ఉదయం (ఆదివారం) 10 గంటకు విజయవాడలోని స్థానిక చండ్ర రాజేశ్వరరావు గ్రంథాల యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.
ఆంధప్రదేశ్, తెంగాణ రాష్ట్రాలకు చెందిన పులువురు కవులు, రచయితలు, ఆలోచన పరులు, ప్రజాసంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని నిర్వాహకులు శనివారం విడుదల చేసిన ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. అలాగే సమావేశం అనంతరం వెయ్యి మంది రచయితలు, కవులతో నిరసన ప్రకటన ఉంటుందని చెప్పారు.
కవులు, రచయితలు సంతకాలు చేసిన నిరసన ప్రకటనను కేంద్రానికి పంపుతామని కూడా తెలిపారు. దేశంలో మతపరమైన విభజనను తీసుకొచ్చిన ఈ బిల్లును కేంద్రప్రభుత్వం భేషరతుగా ఉపసంహరించుకోవాని ఇందులో డిమాండు చేయనున్నారు.