భారత మాజీ ప్రధాని పి.వి నరసింహారావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి అని ప్రముఖ సాహితీ పరిశోధకులు,కవి,రచయిత శ్రీ వేదార్థం మధుసూదన శర్మ అన్నారు.(30-12-2020)  బుధ   వారం నాడు హైద్రాబాదుకు చెందిన ప్రసిద్ధ ఆర్థిక రంగ నిపుణులు,సాహితీవేత్త డా.కర్నాటి లింగయ్య గారు రచించిన "నవభారత నిర్మాత పివి-దేశానికే ఠీవి" అనే పుస్తకాన్ని తెలుగు భారతి సాహితీ సంస్థ ఆధ్వర్యములో కొల్లాపూర్ పట్టణములో, కొల్లాపూర్ సాహితీ మిత్రులు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మధుసూదన శర్మ మాట్లాడుతూ గొప్ప సాహిత్యకారునిగా,బహు గ్రంధకర్తగా,బహు బాషా కోవిధుడుగా,సంస్కరణల రూపశిల్పిగా, మార్గదర్శిగా, రాజనీతిజ్ఞుడిగా,సమరయోధుడిగా,భారత ప్రధానిగా తెలుగుజాతి కీర్తిని నలుదిశలా చాటిన ఘనుడు పి.వి అని ఆయన అన్నారు.

పి.వి గారి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న ఈ సమయములో,వారి జీవితములోని ముఖ్య ఘట్టాలను కవిత్వరూపములో అందించిన డా.కర్నాటి లింగయ్య గారు అభినందనీయులని ఆయన అన్నారు.ఈ కార్యక్రమములో తెలుగు భారతి సంస్థ అధ్యక్షులు ఆమని కృష్ణ,కవులు డా.గుడెలి శీనయ్య,డా.రాం చందర్ రావ్,వేముల కోటయ్య,రాజేందర్ రెడ్డి,వరలక్మి తదితరులు పాల్గొన్నారు.

కథలు పంపించండి

ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో1 జనవరి 2020 నుండి డిసెంబర్ 31, 2020 వరకు వివిధ దిన, వార, పక్ష, మాస పత్రికలలోనూ, అంతర్జాల పత్రికలలోనూ ప్రచురించబడిన దళిత కథల నుంచి ఎంపిక చేయబడిన కథలతో దళిత కథావార్షిక 2020 పేరిట కథా సంకలనం (isbn నంబర్ తో) ప్రచురించాలని సంకల్పించాము.

కావున దళిత కథకులు తమ కథలను ఫాంట్ సైజ్ 15 తో అను పేజి మేకర్ ఓపెన్ ఫైల్ మరియు పిడిఎఫ్ ఫైల్ లేదా యూనికోడ్ ఓపెన్ ఫైల్ పంపించగలరని కోరుతున్నాము. ఈ క్రింద ఇవ్వబడిన ఈమెయిల్ కు జనవరి 10, 2021 లోపల పంపగలరని కోరుతున్నాము.

Email: sygiri773@gmail.com

చరవాణి సంఖ్య:
 9441244773, 
94933 19878, 
9441641702

సంపాదకులు:
డా. సిద్దెంకి యాదగిరి,
గుడిపల్లి నిరంజన్,
తప్పెట ఓదయ్య.