జాతీయ సదస్సులో పాల్గొన్న భీంపల్లి శ్రీకాంత్
ఏ.వి. ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ పిజి కళాశాల తెలుగు శాఖ మరియు యాద శంకర మెమోరియల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సదస్సులో పాలమూరు జిల్లాకు చెందిన కవి, పరిశోధకులు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఏ.వి. ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ పిజి కళాశాల తెలుగు శాఖ మరియు యాద శంకర మెమోరియల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సదస్సులో పాలమూరు జిల్లాకు చెందిన కవి, పరిశోధకులు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ పాల్గొన్నారు. నవంబర్ 8 న హైదరాబాద్ లోని ఏ.వి. పి.జి కళాశాలలో " చాటువులు - చమత్కారాలు - సమాలోచన " అంశంపై జరిగిన జాతీయ సదస్సులో డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ "ఆధునిక సాహిత్యంలో చాటువులు'' అనే అంశంపై పత్రసమర్పణ చేశారు. ఇందులో చాటువుల పుట్టుపూర్వోత్తరాలను, ప్రాచీన మరియు ఆధునిక సాహిత్యంలో వచ్చిన చాటువులను ఉదాహరణలతో వివరించారు.
అనంతరం భీంపల్లి శ్రీకాంత్ ను సదస్సు సంచాలకులు డాక్టర్ ఎలుగందుల సత్యనారాయణ, యాద శంకర మెమోరియల్ ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ ఎస్.బాబులు మెమెంటో, ప్రశంసాపత్రాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ తెలుగు శాఖాధిపతి ఆచార్య వెలుదండ నిత్యానందరావు, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు డాక్టర్ ఎస్. రఘు, తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు డాక్టర్ సి.హెచ్. లక్ష్మణ చక్రవర్తి, డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్, డాక్టర్ చింతల రాకేష్ భవాని, డాక్టర్ సి.యాదగిరి, కూర చిదంబరం తదితరులు పాల్గొన్నారు.
కాగా.. 36 వ ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు -2023 పరిశీలన కోసం కవులు తమ కవితా సంపుటాలను పంపవలసినదిగా అవార్డు వ్యవస్థాపకులు డా. రాధేయ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. అవార్డు పరిశీలన కోసం 2023 సంవత్సరంలో ప్రచురింపబడిన కవితా సంపుటాలను మొదటి ప్రచురణలు మాత్రమే పంపాలి. న్యాయ నిర్ణేతలచేత ఎంపిక చేయబడిన ఉత్తమ కవితా సంపుటికి ఆరువేల రూపాయలు నగదు, షీల్డ్ తో కవికి సత్కారం ఉంటుందని తెలిపారు.
10 జనవరి 2024 తేదీలోగా నాలుగు ప్రతులు ఈ కింది చిరునామాకు పంపగలరు.
డా. రాధేయ అవార్డు వ్యవస్థాపకులు
13 - 1 -606 -1 షిర్డీ నగర్,
రెవిన్యూ కాలనీ ,
అనంతపురం -515001
ఆంధ్రప్రదేశ్.
మొబైల్ : 9985171411