అయోధ్యారెడ్డి “కథాసంగమం” పుస్తకావిష్కరణకు సర్వం సిద్దం
తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, ఆన్వీక్షికి పబ్లిషర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వచ్చే గురువారం ఎ.యం.అయోధ్యారెడ్డి “కథాసంగమం” పుస్తకావిష్కరణ కార్యక్రమం రవీంద్ర భారతిలో జరగనుంది.
హైదరాబాద్: ప్రముఖ కథా రచయిత, అనువాదకులు ఎ.యం.అయోధ్యారెడ్డి అంతర్జాతీయ ఉత్తమ కథల అనువాద సంకలనం “కథాసంగమం” ఆవిష్కరణ సభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఏప్రిల్ 21న అంటే గురువారం సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాలులో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, ఆన్వీక్షికి పబ్లిషర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యహైక్రమానికి ప్రముఖ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షులు నందిని సిధారెడ్డి అధ్యక్షత వహిస్తారు.
ప్రఖ్యాత కవి, సరస్వతి సమ్మాన్ పురస్కార గ్రహీత కె.శివారెడ్డి ఈ సంకలనాన్ని ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ. వక్తలు ప్రముఖ విమర్శకులు ఎన్.వేణుగోపాల్, ధింసా, ఆత్మీయ అతిథులుగా ప్రముఖ కథా రచయిత, ఫిల్మ్ మేకర్, వెంకట్ శిద్దారెడ్డి, ప్రముఖ సాహితీవేత్త కె.పి.అశోక్ కుమార్ పాల్గొంటారు.
పర్సా సైదులు పురస్కారం
గమ్యం-గమనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు పర్సా సైదులు గారి జ్ఞాపకార్థం ప్రతియేటా సాహిత్య, సేవా రంగాల్లో రాష్ట్ర స్థాయి పురస్కారాలను అందజేయనున్నారు. దీనిలో భాగంగా సాహిత్యరంగానికి సంబంధించి 2020, 2021, 2022 సంవత్సరాలలో ప్రచురితమైన కవిత, కథ, విమర్శ, బాల సాహిత్య ప్రక్రియల నుండి 4 ప్రతులను తేదీ మే 10, 2022 లోపు పంపవలసిందిగా పర్సా వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలియజేశారు.
పుస్తకాలను పంపవలసిన చిరునామా:
పర్సా శ్రీనివాస్ AEO, అన్నపురెడ్డి పల్లి, భద్రాద్రి కొత్తగూడెం - 507316 .
ఫోన్ : 9642163963 , 9951391391.