Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ సారస్వత పరిషత్ అవార్డ్ అందుకున్న ఏషియానెట్ న్యూస్ తెలుగు ఎడిటర్ కాసుల ప్రతాపరెడ్డి

2023 సంవత్సరానికి తెలంగాణ సారస్వత పరిషత్తు వివిధ ప్రక్రియల్లో కృషి చేస్తున్న వారికి బుధవారం సారస్వత పరిషత్ అవార్డ్ లను అందజేసింది.  ఏషియానెట్ న్యూస్ తెలుగు ఎడిటర్ కాసుల ప్రతాపరెడ్డి ఈ అవార్డు అందుకున్నారు.

Asianet News Telugu Editor Kasula Prathapareddy received the Telangana Saraswata Parishad Award - bsb
Author
First Published Aug 23, 2023, 11:56 AM IST

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రదేశాల్లో ఉన్న సాహితీమూర్తులకు పురస్కారాలను బుధవారం (23 ఆగస్టు)నాడు పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్యలు అందజేశారు. 

Asianet News Telugu Editor Kasula Prathapareddy received the Telangana Saraswata Parishad Award - bsb

తన పేరుతో ఆచార్య రావికంటి వసునందన్ నెలకొల్పిన పురస్కారాన్ని వి.పి.చందన్ రావుకు, ఆచార్య పి సుమతీ నరేంద్ర అమ్మమ్మ శ్రీమతి ఎర్రం రెడ్డి రంగనాయకమ్మ పేరుతో వారి కుటుంబ సభ్యులు నెలకొల్పిన పురస్కారాన్ని కాసుల ప్రతాపరెడ్డికి, డాక్టర్ లక్ష్మీరెడ్డి నెలకొల్పిన ఆచార్య పాకాల యశోదారెడ్డి సాహితీ పురస్కారాన్ని డాక్టర్ తంగెళ్ల శ్రీదేవి రెడ్డికి, ఆలూరి అజయ్ కుమార్ నెలకొల్పిన ఆలూరి బైరాగి పురస్కారాన్ని సిద్ధార్థ కు, డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య నెలకొల్పిన డాక్టర్ వానమామలై వరదాచార్య పురస్కారాన్ని ఆచార్య ఫణీంద్రకు, డాక్టర్ చింతపల్లి వసుంధరా రెడ్డి ఆధ్వర్యంలోని జానపద సాహిత్య పరిషత్తు నెలకొల్పిన జానపద విజ్ఞాన పురస్కారాన్ని డాక్టర్ పాకనాటి జ్యోతికి అందజేశారు.

ఈ రోజు ఉదయం 10:30 కు పరిషత్ లోని డాక్టర్ దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో జరిగిన ఉత్సవంలో ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. పురస్కారం కింద 5000 రూపాయల నగదు, జ్ఞాపిక, శాలువాతో పురస్కార గ్రహీతలను సత్కరించారు. ఇస్రో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చంద్రయాన్ 3 చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ విక్రమ్ దిగనున్న రోజే ఈ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. ఇది ఎప్పటికీ గుర్తు ఉంటుందని అవార్డు గ్రహీతలు అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios