అన్నవరం దేవేందర్ కవిత : దేహపుటాకు

ప్రకృతిలో సహజాతి సహజం ఆకురాలు కాలం - దేహంలోనూ జీవకణ విభజన తరిగే గుణం అంటూ అన్నవరం దేవేందర్ రాసిన కవిత  ' దేహపుటాకు ' ఇక్కడ చదవండి : 

Annavaram Devender's poem : Dehaputaku - bsb - opk

చెంగుమనే చెంగలింపుల నెమ్మదితనం
నరాల్లో పలచనైన జిగిబిగి ప్రవాహం

పెయ్యి మీద నిగారింపు పొడలో తేడా
పెద్దమనిషి తనం ఆవరిస్తున్న పెద్దరికం

మోకాళ్ళ కీళ్లు కలుక్కు సులుక్కులు
ఎక్కడాలు దిగడాలు తగ్గించే వీచికలు

తల మీద వెంటుకల తెలతెల్లని మార్పులు
తాపతాపకు అద్దం చూసుడెందుకనే లోచనలు

దవడ పండ్లలోంచి జివ్వుమన్న రాగం
బొక్కలు ఎక్కువ తక్కువ నమల వద్దనే

తిన్నది తిన్నట్టుగ అరిగి కరిగిపోతలేదా
కొంచెం ఆచి తూచి తినమనే సూచిక

పేరు మరచి రూపమే గుర్తుకొస్తున్నదా
మనోఫలకం లోన స్పేస్ నిండిందనే ఎరుక

ప్రకృతిలో సహజాతి సహజం ఆకురాలు కాలం
దేహంలోనూ జీవకణ విభజన తరిగే గుణం.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios