Asianet News TeluguAsianet News Telugu

అమ్మంగి వేణుగోపాల్ కవిత : వాతావరణ సూచన !

నీడనిచ్చే పచ్చని చెట్టు గొడుగు అడుగుతున్నదెందుకు ? అంటూ అమ్మంగి వేణుగోపాల్ రాసిన కవిత ' వాతావరణ సూచన ! ' ఇక్కడ చదవండి : 

Ammangi Venugopal's poem - bsb - OPK
Author
First Published Jul 24, 2023, 1:06 PM IST | Last Updated Jul 24, 2023, 1:06 PM IST

టమాట కోస్తుంటే
కలకంఠి కంట కన్నీరెందుకు ?
హఠాత్తుగా ఆకాశం వైపు
చంద్రయాన్ పరుగెందుకు ?
నీళ్ళలో మునిగిన చేప
బురదను కప్పుకున్నదెందుకు ?
రైతు కన్నీటి ఆవిరితోనే
నింగి మబ్బులు నిండెనెందుకు ?
ఎందుకా ?
వానాకాలం వచ్చినా
సూర్యతాపం తగ్గనందుకు !

పక్షులన్నీ హిమాలయాలకు
పరుగుతీసెనెందుకు ?
పిండారబోసినట్టుండే వెన్నెల
మండుటెండగా  మారెనెందుకు ?
నీడనిచ్చే పచ్చని చెట్టు
గొడుగు అడుగుతున్నదెందుకు ?
వాతావరణ సూచన
నవ్వు తెప్పిస్తున్నదెందుకు ?
ఎందుకా ? 
ప్రకృతి ధర్మం కూడా
తిరుగుబాటు కోరుతున్నందుకు !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios