Asianet News TeluguAsianet News Telugu

అమ్మంగి వేణుగోపాల్ కవిత : జెండా

నియంత ఖైదు చేసినా దేశ జనం గుండెనిండా
ఒకే జెండా ఎగురుతుంది అంటూ అమ్మంగి వేణుగోపాల్ రాసిన కవిత " జెండా "  ఇక్కడ చదవండి : 

Ammangi Venugopal Poem : Flag - bsb
Author
First Published Jan 26, 2023, 9:44 AM IST

సముద్రాలు వేరు చేసినా
చల్లగాలి ఒకటి చేస్తుంది
ఎడారులు వేరు చేసినా
ఆకాశం ఒకటి చేస్తుంది
పర్వతాలు వేరు చేసినా
నదీ ప్రవాహం ఒకటి చేస్తుంది
నియంత ఖైదు చేసినా
నినాదం ఒకటి చేస్తుంది
దేశ జనం గుండెనిండా
ఒకే జెండా ఎగురుతుంది

Follow Us:
Download App:
  • android
  • ios