ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు స్మారక సాహిత్య పురస్కార సభ
అరసం వరంగల్ వారు ప్రతి సంవత్సరం ఒక్కో సాహిత్య ప్రక్రియకు “ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు స్మారక సాహిత్య పురస్కారం” ప్రదానం చేస్తున్నారు. ఆ ప్రతిష్టాత్మక పురస్కార వివరాలు ఇక్కడ చదవండి:
అరసం వరంగల్ వారు ప్రతి సంవత్సరం ఒక్కో సాహిత్య ప్రక్రియకు “ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు స్మారక సాహిత్య పురస్కారం” ప్రదానం చేయుట మీకు తెలిసిందే. 2023 సంవత్సరంకు గాను కథలకు ప్రదానం చేయుటకు నిర్ణయించి కథా సంపుటాలను ఆహ్వానించగా 45 కథా సంపుటాలు అందినవి. వాటిలో నుండి డా॥రమణ యశస్వి “మా గణపవరం కథలు” , నెల్లుట్ల రమాదేవి ”తల్లివేరు” కథా సంపుటాలను ముగ్గురు న్యాయనిర్ణతేలు సంయుక్తంగా ఎంపిక చేసినారు.
24 డిసెంబర్ ఆదివారం రోజున ఉదయం 11 గంటలకు హన్మకొండలోని ప్రభుత్వ అభ్యసన ప్రాథమిక పాఠశాలలో జరుగు కార్యక్రమంలో డా॥రమణ యశస్వి, నెల్లుట్ల రమాదేవి గార్లకు “ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు స్మారక సాహిత్య పురస్కారం 2023” సంయుక్తంగా ప్రదానం చేయబడును. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అరసం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మినారాయణ, విశిష్ట అతిథిగా అరసం జాతీయ కార్యదర్శి వేల్పుల నారాయణ పాల్గొంటారని అరసం వరంగల్ అధ్యక్షులు - నిధి, ప్రధాన కార్యదర్శి - పల్లేరు వీరస్వామి గార్లు తెలిపారు.