రేడియమ్ కవిత : న్యాయం
న్యాయస్థానాల ఔనత్యానికి శిరస్సు వంచాలి అంటూ రేడియమ్ రాసిన కవిత ' న్యాయం ' ఇక్కడ చదవండి :
తీర్పు
ఎందరికో ఓ దార్పు
పోరాటానికి గుర్తింపు
న్యాయస్థానాలు
కళ్లు తెరిస్తే
తోపులు బూది కాక తప్పదు
ముళ్లదారులు పూలదారులే...
అబల అంతరంగం
జీవఫలాలు
ప్రేమఫలాలు
త్యాగ ఫలాలు
ఫలాలు వంశవృక్షాలు
చెటంత మనిషి
నేల కూలిస్తే
చింత చీకాకులు
ఏకాకులుగా
మిగిలి పోతారు కొందరు...
ఒంటరి పోరాటం
బలం బలగాలు బలసిన దున్నలు
నిజనిర్ధాణ కటకటాలలో పందులు
బందెర దొడ్డినుండి బయటకి
మళ్ళి లోపటికి
కారకారణాల వల్ల
ఉన్నత స్థానం కల్పించేది మనమే
కందకాల్లో పడతోసేది మనమే
ఒన్ ప్లస్ ఒన్ ఒన్నే
అనే మాట గొప్ప మాట
అదే జయం బాట...
మారాలి రాక్షస క్రీడ
మారాలి సమాజ హితంగా
రాజ్యాంగాన్ని గౌరవించాలి
న్యాయస్థానాల ఔనత్యానికి
శిరస్సు వంచాలి