"గంగెద్దు" కథల సంపుటి పరిచయ సభ
శీలం భద్రయ్య రాసిన “గంగెద్దు” కథల - పుస్తక పరిచయ సభ 29 జనవరి 2023, ఆదివారం సాయంత్రం 5 గంటలకు నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజారు, పాత కలెక్టరేట్ వద్దగల టి.ఎన్.జి.వో. కార్యాలయంలో నిర్వహిస్తున్నారు.
శీలం భద్రయ్య రాసిన “గంగెద్దు” కథల - పుస్తక పరిచయ సభ 29 జనవరి 2023, ఆదివారం సాయంత్రం 5 గంటలకు నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజారు, పాత కలెక్టరేట్ వద్దగల టి.ఎన్.జి.వో. కార్యాలయంలో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా సాగర్ల సత్తయ్య, ప్రధాన వక్తలుగా డా. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, డా. తండు కృష్ణ కౌండిన్య, ముఖ్య అతిథులుగా జిల్లా విద్యా శాఖధికారి బి. బిక్షపతి హాజరవుతున్నారు.
అతిథులుగా టి.ఎన్.జీ.వో జిల్లా సంఘం అధ్యక్షులు యం. శ్రవణ్, నల్లగొండ ప్రముఖ కథకులు మేరెడ్డి యాదగిరిరెడ్డి, ఎలికట్టె శంకర్ రావు, భూతం ముత్యాలు, పుప్పాల కృష్ణమూర్తి, స్కైబాబ, బోధనం నర్సిరెడ్డి, దొడ్డి రామ్మూర్తి, ముడుంబై పురుషోత్తమాచార్యులు, వి. మల్లికార్జున్, పద్య, గేయ రచయితలు ఊట కవి డా. యల్. లేఖానంద స్వామి, అంబటి వెంకన్న, సినీ దర్శకులు బొల్లెద్దు కిశోర్ కుమార్, సినీ నాటక రంగ ప్రసిద్దులు కోమలి కళా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బక్కా పిచ్చయ్య, మాదగాని శంకరయ్య, ప్రముఖ కవులు జీవకవి మునాసు వెంకట్, ఆర్తి కవి బైరెడ్డి కృష్ణారెడ్డి, సహజ కవి బెల్లి యాదయ్య, పగడాల నాగేందర్, కాలస్పర్శ కవి పెరుమాండ్ల ఆనంద్, డా. మహ్మద్ హసేన, బండారు శంకర్ తో బాటు పలువురు ప్రముఖులు హాజరవుతున్న ఈ కార్యక్రమానికి సాహితీ ప్రియులందరూ హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.