ఎంత సేపైనా... క్లైమాక్స్ కి చేరకపోతే..?

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 13, Mar 2019, 3:20 PM IST
when delayed ejaculation disorder occurs?
Highlights

శ్రీఘ్ర స్ఖలనంతో బాధపడే వారు ఉన్నట్లే... ఎంత సేపు శృంగారంలో పాల్గొన్నా కూడా స్ఖలనం కాక ఇబ్బంది పడుతుంటారు. 

శ్రీఘ్ర స్ఖలనంతో బాధపడే వారు ఉన్నట్లే... ఎంత సేపు శృంగారంలో పాల్గొన్నా కూడా స్ఖలనం కాక ఇబ్బంది పడుతుంటారు. ఈ రెండింటిలో ఏ సమస్య ఉన్నా కూడా ఇబ్బంది పడక తప్పదు. భర్తల్లో ఈ సమస్య ఉంటే.. భార్యలు విస్కుకోవడం ఖాయం. దీనినే డీలేడ్ ఎజాక్యులేషన్ అంటారు.

ఈ సమస్య ఉన్నవారు..అంతా సజావుగానే ఉన్నా, అంగప్రవేశం తర్వాత ఎంతకీ క్లైమాక్స్‌కు చేరుకోలేక వీర్యస్ఖలనం జరగదు. దాంతో ఎంత సమయం గడిచినా అసంతృప్తితో సెక్స్‌ విరమించవలసి వస్తూ ఉంటుంది. మహిళలకు ఈ ధోరణి చిరాకు తెప్పించడమూ సహజమే! అయితే ఈ సమస్యకు కారణాలున్నాయి. కొందరికి హస్తప్రయోగం అలవాటు ఎక్కువగా ఉంటుంది. 

ఆ సమయంలో కలిగే ఒరిపిడి, లైంగిక క్రీడలో పొందలేకపోవచ్చు. భార్య మీద ఆసక్తి లోపించినా, పెళ్లికి ముందు ఊహించిన దానికి విరుద్ధమైన భాగస్వామి దొరికినా ఈ పరిస్థితి రావచ్చు. పోర్న్‌ ఎక్కువగా చూసే కొందరు పురుషులు ఆ వీడియోల్లో మహిళల్లా తమ భార్యలూ ప్రవర్తించాలని కోరుకుంటూ ఉంటారు. అలా జరగనప్పుడు కూడా ఎంతసేపటికీ స్ఖలనం జరగదు.

మరికొందరికి అంగం పూర్వచర్మం పూర్తిగా వెనక్కి రాదు. ఫైమోసిస్‌ సమస్య లేకపోయినా, అంగం ముందు భాగాన్ని కప్పి ఉంచే ఈ చర్మం వల్ల నొప్పి కూడా ఉండదు. కాకపోతే నాడులు ఎక్కువగా ఉండే ఆ ప్రదేశానికి ఒరిపిడి అందక క్లైమాక్స్‌కు చేరుకోలేకపోతూ ఉంటారు.  సమస్య ఎక్కడ ఉందో తెలుసుకొని వైద్యులను సంప్రదిస్తే.. మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. 

loader