కరెంటు బిల్లును తగ్గించుకోవడం ఎలా?

తినడం, తాగడం మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అయినట్టే.. కరెంటు కూడా మన లైఫ్ ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ప్రస్తుత కాలంలో కరెంటు లేకుండా పనిచేయడం కష్టమే. కానీ కరెంటును ఎక్కువగా వాడటం వల్ల బిల్లు ఎక్కువగా పడుతుంది. ఇది మీ డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యేలా చేస్తుంది. అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో కరెంటు బిల్లు పెరగకుండా చూసుకోవచ్చు. అదెలాగో చూసేయండి. 
 

use these tips to save electricity as well as your money rsl

అసలు కరెంటు అంటూ లేకుంటే మన జీవితం ఎలా ఉండేదో ఆలోచించడానికే భయకరంరంగా ఉంది కదూ.. మన రోజువారి అవసరాల నుంచి పని వరకు కరెంటును వినియోగిస్తూనే ఉంటాం. స్కూల్ , కాలేజీ, కంపెనీలు, ఇండ్లు, ఇలా ప్రతి చిన్నా, పెద్దా చోట్ల కరెంటును వినియోగిస్తున్నారు. కరెంటును అవసరానికి ఉపయోగించడంలో తప్పేం లేదు. నిజానికి కరెంటు లేకుంటే ఎన్నో పనులు కూడా ఆగిపోతాయ్.  అయితే నెలాఖరులో కరెంటు బిల్లు మాత్రం మనల్ని ఇబ్బంది పెడుతుంది. చాలా సార్లు కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంటుంది. మేము ఎక్కువగా వాడనేలేదే.. ఇలా ఎక్కువగా ఎందుకు వస్తుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. నిజానికి మనం చేసే కొన్ని పొరపాట్లే కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చేలా చేస్తాయి. అందుకే కరెంటు బిల్లు ఎక్కువగా రాకుండా ఉండేందుకు ఏం చేయాలో? ఎలాంటి చిట్కాలను ఫాలో కావాలో తెలుసుకుందాం పదండి. 

ఇల్లు లేదా ఆఫీస్ ను నిర్మించేటప్పుడు ఇలా చేయండి

దీని గురించి ఆర్కిటెక్ట్ తో మాట్లాడండి. అంటే పగటిపూట కూడా ఇంట్లో లేదా ఆఫీస్ లోని ప్రతి మూలలో లైట్లు వెలిగించాల్సిన అవసరం లేదు. కాబట్టి మూలల్లో లైట్లను పెట్టించకండి. రూం లో రెండు లైట్లు సరిపోతాయి. అలాగే పగటిపూట గదిలో లైట్లను వేయాల్సిన అవసరమే రాదు. ఈ చిన్న మార్పు మీ ఇంటి నిర్వహణకు బడ్జెట్ ను బాగా తగ్గిస్తుంది. కరెంటు బిల్లు ఎక్కువగా రాకుండా చేస్తుంది.

సోలార్ ప్యానెల్స్ ఉపయోగించండి

మీ ఇంట్లో నైట్ లైట్ కోసం ఆఫ్గ్రిడ్ సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేయండి. మీకు తెలుసా? ఇది మీ ఇంటి కరెంటు బిల్లును బాగా తగ్గిస్తుంది. ఇక ఆఫీసు అవసరాల కోసం ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఉపయోగించండి. దీంతో మీరు కరెంటు బిల్లు ఎక్కువగా రానే రాదు. 

ఎల్ఈడీ బల్బులు వాడండి

ఇతర బల్బుల కంటే ఎల్ఈడీ బల్బులే మంచివి. అందుకే మీ ఇంట్లోని అన్ని రూముల్లో వీటిని ఉపయోగించండి. ఎందుకంటే ఇవి పవర్ ను సేవ్ చేయిస్తా. ఇవి వాడిన తర్వాత తేడాను మీరే గమనిస్తారు. 

5 స్టార్ పరికరాలను మాత్రమే ఉపయోగించండి

ఎలక్ట్రానిక్ పరికరాలను కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏవి పడితే అవి కొంటే మీ కరెంట్ బిల్లు విపరీతంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 5-స్టార్ రేటెడ్ ఉన్న ఎలక్ట్రిక్ పరికరాలను మాత్రమే కొనండి. అయినా ప్రస్తుతం అన్ని యంత్రాలపై రేటింగ్స్ ను ఖచ్చితంగా ఇస్తున్నారు. కాబట్టి ఏ పరికరం ఎంత విద్యుత్తును వినియోగిస్తుందో కూడా మీరు తెలుసుకోవచ్చు. 1 లేదా 2 స్టార్స్ ఉన్నపరికరాలు 5 స్టార్ వాటికంటే చౌకగా ఉంటాయి. అలా అని వీటిని కొంటే మాత్రం కరెంటు బిల్లును భరించడం చాలా కష్టం. ఎందుకంటే ఇవి విద్యుత్తును ఎక్కువగా ఉపయోగిస్తాయి. అందుకే కేవలం 5 స్టార్ ఎక్విప్ మెంట్ మాత్రమే కొనండి. 

సకాలంలో కరెంటు బిల్లు చెల్లించడం

కరెంటు బిల్లును టైం కే కట్టాలి. చెల్లించాల్సిన టైం లోపు కరెంటు బిల్లును చెల్లించకపోతే జరిమానా లేదా పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. ఇది కూడా మీబిల్లును మరింత పెంచుతుంది. అందుకే బిల్లును ఎప్పుడూ కూడా గడువు లోగా కట్టేయండి. ఇది మీ డబ్బు వృధా కాకుండా చేస్తుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios