సూర్యగ్రహణం 2023: ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం ఇదే.. గర్భిణులు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!
solar eclipse 2023: సూర్యగ్రహణం 2023: ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 14 అంటే శనివారం రోజున ఏర్పడనుంది. ఈ సూర్యగ్రహణం సమయంలో రాహువు ప్రభావం పెరుగుతుంది. అందుకే సూర్యగ్రహణం సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయొద్దని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. అలాగే గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
solar eclipse 2023: సనాతన ధర్మంలో సూర్యగ్రహణాలు, చంద్ర గ్రహణాలు అశుభంగా పరిగణిస్తారు. అందుకే ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు. కాగా ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 14వ తేదీన అంటే శనివారం రోజున ఏర్పడనుంది. సూర్యగ్రహణం సమయంలో రాహువు ప్రభావం బాగా పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అందుకే సూర్యగ్రహణం సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయొద్దని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. అలాగే గర్భిణులు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా తల్లీ, బిడ్డ ఇద్దరిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం భారత్ లో కనిపించదని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీనికి సుతక్ కాలం కూడా చెల్లదు. అయినప్పటికీ సూర్యగ్రహణం సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ గ్రహణం సమయంలో గర్భిణులు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
- గర్బిణులు సూర్యగ్రహణం సమయంలో ఇంట్లోనే ఉండాలి. బయటకు అసలే వెళ్లకూడదు.
- అలాగే ఈ సూర్య గ్రహణాన్ని నేరుగా కళ్లతో చూడకూడదు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు.
- ఈ గ్రహణం సమయంలో నిద్రపోకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు.
- అలాగే గర్బిణులు సూదులు, కత్తెరలు, కత్తులు వంటి పదునైన వస్తువులను అసలే వాడకూడదు. వీటిని ముట్టుకోకూడదు.
- ఈ సమయంలో గర్భిణులు బరువైన వస్తువులను ఎత్తకూడదు. అలాగే ప్రమాదకరమైన పనులను అసలే చేయకూడదు.
- సూర్య గ్రహణం సమయంలో ఆహారాన్ని తినకూడదని, వండకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎందుకంటే గ్రహణం వల్ల ఆహారం కలుషితమవుతుందని నమ్ముతారు. గ్రహణం సమయంలో తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయంటారు. అయితే సుతక్ భారతదేశంలో చెల్లదు. అందుకే గ్రహణ సమయంలో పిల్లలు, వృద్ధులు ఆహారం తినొచ్చు.
- సూర్య గ్రహణ సమయంలో లేదా ముందు జుట్టుకు లేదా శరీరానికి నూనెను అప్లై చేయకూడదు. ఇది రాహువుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
- గ్రహణం ముగిసిన తర్వాత గర్భిణులు తప్పనిసరిగా స్నానం చేయాలి. అలాగే ధ్యానం చేస్తూ దేవుళ్లను పూజించాలి. అలాగే నవజాత శిశువు ఆరోగ్యం కోసం ఆహారాన్ని దానం చేయాలని జ్యోతిష్యులు చెబుతున్నారు.