వినాయక చవితి హిందువులకు అతి పెద్ద పండగల్లో ఒకటి. వినాయక చవితినాడు ఇంట్లో ఎక్కడ దీపాలు పెట్టుకోవాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇది ఆ ఇంటికి ఆశీస్సులను, శ్రేయస్సును తెచ్చిపెట్టే పండుగ. 

ప్రతి ఏడాది భాద్రపద మాసం శుక్ల పక్ష చతుర్థ తిధి నాడు వినాయక చవితిని నిర్వహించుకుంటాము. ఈ ఏడాది ఆగస్టు 27న వినాయక చవితి వచ్చింది. ఇప్పటికే వినాయకుడు కొలువుదీరేందుకు మండపాలను కట్టడం ప్రారంభించారు. అలాగే లడ్డూలు, మోదక్ లు వంటి తయారీలకు కూడా సిద్ధమవుతున్నారు. ఇంట్లో కూడా వినాయకుడిని ఆ రోజు దీప ధూప నైవేద్యాలతో పూజిస్తారు. ఆ గణేషుడి ఆశీస్సులను పొందుతారు. అయితే వినాయక చవితి రోజు కచ్చితంగా ఇంట్లోనే కొన్ని ప్రదేశాలలో దీపాన్ని వెలిగించాలి.

ఇలా దీపాన్ని వెలిగించడం వల్ల ఆ ఇంటికి అంతా మేలే జరుగుతుంది. ఎక్కడెక్కడ దీపాలు వెలిగించాలో ఇక్కడ మేము ఇచ్చాము.

ఇంటి ప్రధాన ద్వారం వద్ద

ఇంటికి ప్రధాన ద్వారం ఎంతో ముఖ్యమైనది. కాబట్టి ప్రధాన ద్వారం వద్ద కచ్చితంగా వినాయక చవితి రోజు దీపం వెలిగించాలి. ఇది ప్రతికూల శక్తి ఇంటిని తాకకుండా అడ్డుకుంటుంది. వినాయక చవితి రోజు సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించండి. ఇంట్లో శాంతి, ఆనందం వంటివి నెలకొంటాయి.

ఈశాన్య దిశలో దీపం

వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం వినాయక చవితి నాడు ఇంటికి ఈశాన్య దిశలో దీపం వెలిగించడం ఎంతో మంచిది. ఇలా వెలిగించడం పట్ల ఇంట్లోకి జీవితంలోకి సానుకూల పరిస్థితులు ప్రవేశిస్తాయి. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఆ ఇంట్లోనే నివాసం ఉంటుంది. ఆ ఇంట్లో ఆహారానికి ఎప్పుడూ కొరత ఉండదు.

గణేష్ చతుర్థి నాడు స్నానం చేసి ధ్యానం చేయండి. ఆచారాల ప్రకారము ఆ వినాయకుని పూజించండి. అలాగే అతని ముందు నిండు హృదయంతో దీపం వెలిగించండి. అలాగే వినాయకుడి మంత్రాలను కూడా జపించండి. ఇవన్నీ వినాయకుడిని సంతోషపరుస్తాయి. మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగిపోయేలా చేస్తాయి.

తులసి మొక్క ముందు

ప్రతి హిందువు ఇంట్లో తులసి మొక్క కచ్చితంగా ఉంటుంది. ప్రతి రోజు తులసిని పూజిస్తారు. తులసమ్మ పూజకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. వినాయక చవితి రోజు కూడా సాయంత్రం తులసిని పూజించి ఆ మొక్క ముందు స్వచ్ఛమైన నెయ్యితో దీపం వెలిగించండి. అలాగే తులసమ్మ చుట్టూ ఏడూ లేదా ఐదు సార్లు ప్రదక్షిణ చేయండి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి సంతోషిస్తుంది. మీ ఇంట్లో డబ్బుకి కొరత రానీయకుండా చూసుకుంటుంది.