Girls Google Searching: అమ్మాయిలు రాత్రుళ్లు ఎక్కువగా అలాంటి విషయాలనే గూగుల్లో సెర్చ్ చేస్తున్నారట..
Girls Google Searching: తెలియని ఎన్నో విషయాలను తెలుసుకోవడానికి ఇంటర్నెట్ మనకు ఎంతగానో ఉపయోగపడుతోంది. అందులోనూ ఏ చిన్న డౌట్ వచ్చినా.. ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా.. వితిన్ సెకండ్స్ లో ఆ సమాచారం మన కళ్ల ముందు ఉంటుంది. అయితే 17 శాతం మంది టీనేజర్లు గూగుల్ ల్లో రాత్రి సమయంలో సెక్స్ కు సంబంధించిన విషయాలనే ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారట.
Girls Google Searching: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం బాగా పెరిగింది. రెండు మూడేండ్ల కిందట కేవలం.. పెద్దలకు, కాలేజీ పిల్లలకు మాత్రమే స్మార్టు ఫోన్లు ఉండేవి. కానీ కరోనా రాకతో స్కూళ్లు మూతలు బడటంతో ఆన్ లైన్ క్లాసులు స్టార్ట్ అయ్యాయి. దాంతో స్కూల్ పిల్లలకు కూడా ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం ఎంతమంది కుటుంబ సభ్యులంటే అన్ని మొబైల్ ఫోన్లు ఉంటున్నాయి. ఇకపోతే నేటి ఆధునిక కాలంలో ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగింది. చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే ఓల్డ్ ఏజ్ వాళ్లు కూడా ఫోన్లతోనే కాలక్షేపం చేస్తున్నారు.
కాగా పురుషుల కంటే ఆడవారే ఇంటర్నెట్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారని ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చి చెప్పాయి. ఆ అధ్యయనాల్లో ఆడవారు ఎక్కువగా ఎలాంటి విషయాలను సెర్చ్ చేస్తున్నారో కూడా తెలిసింది. అందులో మెజారిటీ పీపుల్ గూగుల్ సెర్చ్ లో ఎక్కువగా ఎలాంటి విషయాలను వెతుకుతున్నారో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
దేశం మొత్తం మీద 150 మిలియన్ల ప్రజలు ఇంటర్నెట్ ను ఉపయోగిస్తున్నారని జాతీయ మీడియా నివేధికలో వెళ్లడైంది. ఇకపోతే ఇందులో 20 మిలియన్లు(2కోట్లు) ఆడవారు ఆల్ లైన్ లోనే ఎక్కువగా ఉంటున్నారట. కాగా ఈ లీస్ట్ లో 15 నుంచి 34 ఏండ్ల వయసున్న వారే 75 శాతం ఉండటం గమనార్హం. నివేదికల ప్రకారం.. 31 శాతం టీనేజ్ యువతులు గూగుల్ లో తాము ఫిట్ గా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన నియమాల గురించి సెర్చ్ చేశారు. కాగా 17 శాతం అమ్మాయిలు మాత్రం సెక్స్ గురించి, డిప్రెషన్ మొదలైన అంశాల గురించి గూగుల్ సెర్చ్ లో వెతికారట.
అమ్మాయిలు రాత్రుళ్లు వీటినే ఎక్కువగాసెర్చ్ చేశారు:
1. రాత్రి సమయాల్లో అమ్మాయిలు ఎక్కువగా తమ కెరీర్ నిర్మాణం ఎలా ఉండాలి అన్న విషయాలనే ప్రధానంగా వెతికారు. ఏ దారిని ఎంచుకుంటే వారి జీవితం బాగుంటుందో లాంటి విషయాల గురుంచి ఆసక్తి చూపిస్తున్నారు.
2. ఎలాంటి ఆరోగ్య సూత్రలు పాటించాలి. ఎటువంటి చిట్కాలు పాటిస్తే అందం పెరుగుతుంది వంటి బ్యూటీ గురించి కూడా సెర్చ్ చేశారు.
3. ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఊబకాయం. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలనే విషయాలను కూడా గూగుల్ సెర్చ్ లో వెతుకుతున్నారు.
4. అమ్మాయిలకు జుట్టంటే మహాప్రాణం. జుట్టుకోసం ఎలాంటి సాహసమైనా చేస్తుంటారు. ఒక్క వెంట్రుక ఊడినా విలవిలాడుతుంటారు. అంతేకాదు జుట్టు మరింత అందంగా కనిపించేందుకు కూడా రకరకాల చిట్కాలను పాటిస్తుంటారు. అయితే గూగుల్ సెర్చ్ లో జుట్టును ఏ మాదిరి కట్ చేస్తే అందంగా కనిపిస్తామనే విషయాలను కూడా తెలుసుకున్నారు.