Viral Video: ఎగ్జామ్ సెంటర్ లో ఎంత పనిచేసింది ఈ అమ్మాయి? చూస్తే నవ్వకుండా ఉండలేరు!
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోయే రోజులివి. వింత, విశేషాలు, మంచి, చెడు ఏదైనా సరే.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే చాలు. నిమిషాల్లో వైరల్ అవుతుంటాయి. సరిగ్గా అలాంటిదే ఇది.
ఎగ్జామ్ సెంటర్ కు లేటుగా వచ్చిన ఓ స్టూడెంట్ ఏం చేసిందో తెలిస్తే అంతా షాక్ అవుతారు.

ప్రస్తుతం సోషల్ మీడియా కాలం నడుస్తోంది. ఎక్కడ ఏం జరిగినా ఒక్క క్లిక్ తో మనకు ఇట్టే తెలిసిపోతోంది. నిజంగా చెప్పాలంటే కూర్చున్న దగ్గరి నుంచి కదలకుండా అరచేతిలోనే మనం ప్రపంచాన్నిచూస్తున్నాం. చావు, బ్రతుకు, మంచి, చెడు, కష్టం, నష్టం, మోసం ఏదైనా సరే చాలా మంది సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. కొన్నిసార్లు ఆ వీడియోలు విపరీతంగా వైరల్ అవుతుంటాయి. అలాంటి కోవకు చెందిందే మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే విషయం.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. నిజానికి ఆ వీడియో చూస్తే ఎవ్వరూ నవ్వకుండా ఉండలేరు. ఇంతకీ ఆ వీడియో ఏంటంటే.. ఒక విద్యార్థిది. ఫిబ్రవరి 1 నుంచి బీహార్ బోర్డ్ ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. సోషల్ మీడియా ప్రకారం.. పరీక్ష మొదటి రోజే ఒక విద్యార్థిని ఆలస్యంగా వచ్చింది. అప్పటికే ఎగ్జామ్ సెంటర్ గేటు మూసి ఉండటంతో ఆమె లోపలికి వెళ్ళలేకపోయింది. దాంతో ఆ అమ్మాయి గేటు కింద మట్టి తోడడం స్టార్ట్ చేసింది.
నిబంధనల ప్రకారం..
పరీక్షా నిబంధనల ప్రకారం, విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించాలి. ఆ సమయానికి గేటు కూడా మూసివేస్తారు. ఇక పరీక్షకు అనుమతించరు. అయితే ఆ విద్యార్థిని పరీక్షకు వచ్చేసరికి గేటు మూసివేసి ఉంది. దీంతో ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు. తిరిగి వెళ్లలేక, ఓటమిని ఒప్పుకోలేకపోయింది. వెంటనే గేటు కింద మట్టిని తవ్వడం ప్రారంభించింది. కొద్దిసేపటికే అది చిన్న సొరంగం లాగా మారింది. దీంతో విద్యార్థిని సంతోషంగా ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్ళిపోయింది.
వీడియో వైరల్
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 30 మిలియన్లకు పైగా వీక్షించారు. 9 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోకి జనాలు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఒక యూజర్, 'ఇది బీహార్, ఇక్కడ ఏదైనా జరగొచ్చు' అని కామెంట్ చేశారు. ఇంకొకరు, 'ఈ అమ్మాయి బాగా చదువుకుంటుంది' అని అన్నారు.