పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.  లాక్ డౌన్ కారణంగా కాలేజికి సెలవు వుండటంతో సరదాగా జలపాతం చూడటానికి వెళ్లిన యువకుల సెల్పీ మోజు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ప్రమాదవశాత్తు ఓ యువకుడు నీటిలో మునిగి మృత్యువాతపడ్డాడు. 

ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గోదారవరిఖనికి చెందిన ఆవుల యశ్వంత్(22) డిప్లోమా చదువుతున్నాడు. అయితే  ప్రస్తుతం కాలేజీ బంధ్ వుండటంతో ఇంటివద్దే వున్నాడు. ఈ క్రమంలో ప్రెండ్స్ తో కలిసి సరదాగా సబ్బితం జలపాతాన్ని చూడటానికి వెళ్లాడు. 

అయితే అక్కడికి వెళ్లాక యువకులందరు ప్రమాదకరమైన ప్రాంతాల్లో సెల్పీలు తీసుకోవడం ప్రారంభించారు. ఇలా బాగా లోతుగా వున్న నీటికుంట వద్ద ఫోటోలు తీసుకోడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో కాలుజారి యశ్వంత్ నీటిలో పడిపోయాడు. బయటకు రావడం సాధ్యంకాక నీటమునిగి మృత్యువాతపడ్డాడు.