కార్యకర్తలే మా బలం, బలగం: మంత్రి గంగుల కమలాకర్
సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాధించిన తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతుందనీ, 20ఏళ్లుగా వరుస విజయాలు అందిస్తున్న కరీంనగర్ ప్రజలకు మంత్రి గంగుల కమలాకర్ ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్ ప్రగతి రాష్ట్రానికి, దేశానికే తలమానికంగా నిలిచిందని కీర్తించారని అన్నారు.
తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతుందనీ, బీఆర్‌ఎస్‌కు కార్యకర్తలే బలం, బలగమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.గురువారం నాడు కొత్తపల్లి మండలం చింతకుంటలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి మంత్రి గంగుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్ నియోజకవర్గ చరిత్రలో ఏ ఒక్క వ్యక్తి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలువలేదనీ, కానీ.. ఆ ఘనత తనకే దక్కిందని అన్నారు. తనను 2000 సంవత్సరంలో కౌన్సిలర్ గా గెలిపించారని, 2005లో కార్పోరేటర్ గా, 2009 నుండి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, తనను ఆదరిస్తున్న కరీంనగర్ ప్రజానీకానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
కార్యకర్తలే బీఆర్ఎస్ బలగం, కార్యకర్తలు లేకపోతే ఈ గెలుపు లేదని అన్నారు. ఇంతగా ఆదరిస్తున్న కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తనదేనని, తన శక్తి మేరకు పనిచేసి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. బీఆర్ఎస్ హయంలో కరీంనగర్ ఎంత ప్రగతి చెందిందో కళ్లకు కనిపిస్తుందన్నారు. ఎక్కడికెల్లినా మీదేవూరు అంటే కరీంనగర్ అని, మీ ఎమ్మెల్యే ఎవరంటే గంగుల కమలాకర్ అని గర్వంగా చెప్పుకునేలా చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. తనకు గ్రానైట్ ప్యాక్టరీలున్నాయని గెలిస్తే నీల్లన్నీ వాటికే తీసుకుపోతాడని తనపై అసత్య ప్రచారాలు చేసారని అన్నారు. ఇన్నేళ్లలో ఏనాడైనా, ఏ ఊరికైనా నీళ్లు ఆగాయా, నీళ్లు పెరిగాయా అని మంత్రి ప్రశ్నించారు.
గెలవడం కోసం ఏది పడితే అది మాట్లాడనని, ప్రజల సంక్షేమం, నగర అభివృద్దే తన ద్యేయం అన్నారు. తాను పదవి ఉన్నా.. లేకున్నా.. ఒకటే విదంగా ఉంటానని, కౌన్సిలర్ గా ఎలా ఉన్నానో, మంత్రిగా కూడా అలాగే ఉన్ననన్నారు. కరీంనగర్ కి సినీ ఇండస్ట్రీ తరలివస్తుందని, మెడికల్ కాలేజీ, వెంకటేశ్వర టెంపుల్, సెంటర్ల బ్యూటిఫికేషన్, కేబుల్ బ్రిడ్జి, మానేర్ రివర్ ప్రంట్లతో అద్బుతంగా అభివృద్ధి చేసుకున్నామన్నారు. శ్రీవారి భ్రహ్మోత్సవాలు ఒకవైపు, కళోత్సవాలు మరోవైపు అదనంగా విజయోత్సవాలు జరుపుకుంటూ అన్నిరంగాల్లో దూసుకుపోతున్న కరీంనగర్ మనదన్నారు.
గత డెబ్బైఐదేళ్లలో ఎన్ని ప్రభుత్వాలు మారినా సాగునీరు, తాగునీరు, గ్రామాలకు రోడ్లుకూడా లేవని, తను ఎమ్మెల్యేగా ఎన్నికైన నుండే ప్రజలకు వసతుల కల్పనకు తోడ్పడ్డానని అన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రతీ సమస్య సమసిపోతుందని అన్నారు. 24 గంటల ఉచిత కరెంటు, ఆత్మగౌరవ పించన్లు, లక్షలాది ఉపాధి అవకాశాలతో తరలొస్తున్న పరిశ్రమలు అన్నిరంగాల్లో అభివృద్ధి, ఒద్యారం తదితర నాటి గ్రామాలన్నీ జిగెల్మని వెలిగిపోతూ పట్టణంలో కలిసిపోయాయన్నారు. నీటిపన్ను లేదని, ఎకరా భూమి కోట్లలో పలుకుతుందని, భూమికి బారమయ్యే విదంగా పంటను పండిస్తూ, దాన్ని దళారులు లేకుండా కొని నేరుగా అకౌంట్లలో పైసలు వేసే గొప్ప పాలన కొనసాగుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్రాభివృద్ధి, సంక్షేమాన్ని చూసి కొందరూ ఈర్శ పడుతున్నారనీ, బీఆర్ఎస్ పార్టీ ఇంత మంచిగా ఎట్లా చేస్తది, ఇంకెన్ని సార్లు గెలుస్తదని అని బీజేపీ గద్దలు కండ్లు మంటలు పెట్టుకుంటున్నారని దుయ్యబట్టారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, మద్యప్రదేశ్, యూపీల్లో వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. మన అభివృద్ధి చూసి.. ఓర్వలేని వ్యక్తులు పాదయాత్రలో పేరుతో ఆంద్రానుండి ఒకరు, ఓటుకు నోటు కేసు వ్యక్తి ఒకరు, పేపర్ లీకేజీ మనిషి మరొకరు దండయాత్ర చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఢిల్లీలో అదిష్టానాన్ని ఉంచుకునే వారి ఎజెండాలో తెలంగాణ ఉండదని, మన గల్లీలో ఉన్నవాళ్లే మన ఎజెండాతో బాగోగులు చూస్తారన్నారు మంత్రి గంగుల కమలాకర్. సబ్బండ వర్ణాలకు మేలు చేస్తూ జీవన ప్రమాణాలు పెంచిన ప్రభుత్వం కేసీఆర్ గారిది మాత్రమేనని, ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ ది అన్నారు. తెలంగాణపై డిల్లీ పార్టీలు చేస్తున్న కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండి మన ఇంటి పార్టీ బీఆర్ఎస్ ని గెలిపించుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు.