పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గోదావరిఖని పట్టణంలోని జవహార్ నగర్ కాలనీలో ఓ మహిళ కిరాతకానికి పాల్పడింది. కట్టుకున్న భర్తను అత్యంత దారుణంగా కత్తితో నరికి హతమార్చింది. ఈ ఘటనతో ఒక్కసారిగా పట్టణం ఉలిక్కిపడింది.  

స్థానికుల సమాచారంతో సంఘటనా స్ధలానికి  చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. రక్తపుమడుగులో పడివున్న మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అంతకంటే ముందే ఆధారాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. 

ఇంతకూ వివాహిత భర్తను ఎందుకు చంపి వుంటుందన్న దానిపై  స్థానికుల నుండి వివరాలను సేకరిస్తున్నారు. అలాగే మృతుడి కుటుంబసభ్యును కూడా ప్రాథమికంగా విచారించి ఈ హత్యకు గల కారణాలను వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. 

ఇటీవల కాలంలో ఇలా భార్యలు భర్తలను చంపడం మరీ ఎక్కువయ్యింది. నాగర్ కర్నూల్ జిల్లాలో స్వాతి అనే వివాహిత ప్రియుడి మోజులో సినీఫక్కీలో భర్తను చంపడం  సంచలనంగా మారిన విషయం తెలసిందే. అప్పటినుండి వరుసగా  ఇలాంటి సంఘటనే జరిగాయి. తాజాగా ఈ ఘటన చోటుచేసుకోవడంతో మరోసారి చర్చకు దారితీసింది. 

ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది. ప్రాథమిక విచారణ అనంతరం మీడియాకు వివరాలన్ని తెలియజేస్తామని పోలీసులు తెలిపారు.