కరీంనగర్ లోని ఆర్యవైశ్య భవన్ లో ఆర్యవైశ్య జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆర్య వైశ్య కుటుంబంలో నిరుపేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించింది.

మొత్తం వందమందికి ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున స్కాలర్‌షిప్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అమరావతి లక్ష్మీనారాయణ, జిల్లా నాయకులు కన్నకృష్ణ పాల్గొన్నారు. 

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల మన్ననలు అందుకుంది. విద్యార్ధులకు ఉపకార వేతనాలు, పేదలకు దుస్తులు అందించడంతో పాటు ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటోంది.